'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం.. 'మెగా'కు ఆహ్వానం అందలేదా..?
'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న మంచు విష్ణు ఈ రోజు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఉదయం 11 గంటలకు తన కార్యవర్గ సభ్యులతో కలసి ప్రమాణం చేయనున్నారు. పదవీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తవ్వగా.. ఇప్పటికే మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులతో కలిసి కల్చరల్ సెంటర్ కు ఇచ్చారు.
మంచు విష్ణు ప్రమాణ స్వీకార మహోత్సవానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అలాగే నందమూరి బాలకృష్ణను సైతం మంచు ఫ్యామిలీ ప్రత్యేకంగా ఆహ్వానించింది. విష్ణు - మోహన్ బాబు కలిసి బాలయ్య ఇంటికి వెళ్లి మరీ ఇన్వైట్ చేశారు. అలానే సినీ పెద్దలు కైకాల సత్యనారాయణ - కోట శ్రీనివాసరావు - బ్రహ్మానందం - పరుచూరి బ్రదర్స్ - సి. కళ్యాణ్ వంటి వారిని ఈ కార్యక్రమానికి రావాలని విష్ణు కోరారు.
ప్రమాణ స్వీకార మహోత్సవానికి టాలీవుడ్ సినీ పెద్దలను ఆహ్వానించిన మంచు విష్ణు.. మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి చెందిన ఏ ఒక్కరినీ విష్ణు ఆహ్వానించనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిసిన మంచు మనోజ్.. విష్ణు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారని వార్తలు వినిపించాయి. దీనిపై స్పష్టత లేదు.
బాలయ్య ను కలిసిన సందర్భంగా విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. అసోసియేషన్ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్తానని.. చిరంజీవి ని కూడా కలుస్తానని అన్నారు. ప్రస్తుతానికి అయితే మెగా ఫ్యామిలీ సభ్యులు కానీ.. ప్రకాష్ రాజ్ ప్యానల్ అభ్యర్థులు కానీ ఈ వేడుకకు హాజరు కాలేదు. నిజంగానే చిరు కు ఆహ్వానం పంపలేదా? పంపినా రాలేదా? అనేది తెలియల్సి ఉంది.