చిరంజీవి.. బాలకృష్ణ.. కెసిఆర్.. కవిత.. దాసరి.. కృష్ణంరాజు.. ఎన్టీఆర్.. వైఎస్సార్.. కృష్ణ.. చంద్రబాబు.. కెటిఆర్.. లోకేష్.. వీళ్ళందరూ ఎవరూ అంటే?? వీళ్లలో కొందరు నటులు. కొందరు పొలిటీషియన్లు. కొందరు పాలిటిక్స్ లోకి వచ్చిన నటులు. అయితే వీళ్ళందరూ కామన్ గా ఈ భారతదేశ పౌరులు. అంతేకాదు.. వీరందరూ తద్వారా 'ఓటర్లు' అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇదే విషయాన్ని కాస్త గట్టిగా చెబుతున్నాడు మంచు విష్ణు.
తాను ఓటేసి వస్తే తన చేతి చూపుడు వేలికే అంటించి సిరా చుక్కను చూపిస్తూ.. 'ఓటర్' అనే తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ తో తెగ ఆకట్టేసుకుంటున్నాడు మంచు విష్ణు. 'అడ్డా' సినిమా ఫేం కార్తీక్ రెడ్డి డైరక్షన్లో రూపొందిన ఈ సినిమాను త్వరలోనే విడుదల చేస్తారు. మన భారతదేశంలో.. ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ ఓటర్లే అనే సింపుల్ కాన్సెప్పుటుతో చాలా పవర్ ఫుల్ మెసేజ్ ఇస్తున్నాడు. అయితే విష్ణు సినిమా అనగానే.. పొలిటికల్ పంచులు గట్రా కాస్త హెవీగా ఉంటాయనే అంటున్నారు సినిమా లవ్వర్స్. ఎందుకంటే గతంలో కూడా చాలా సినిమాల్లో అలాంటి పంచులను బాగానే పేల్చాడు మనోడు.
ఇకపోతే ఈ సినిమాను ఒకేసారి తెలుగు మరియు తమిళంలో రిలీజ్ చేస్తున్నాడు. ఇక తమిళ వర్షన్ పోస్టర్లో కూడా.. ఎంజీఆర్.. స్టాలిన్.. పెరియార్.. జయలలిత.. అన్భుమణి తదితరుల ఫోటోలతో మనోడు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.