తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మంటలు చెలరేగాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల హీట్ పెరిగింది. విమర్శలు, ఆరోపనలతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అక్టోబర్ 10న 'మా' అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగనుండడంతో బరిలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.ఇప్పుడు ఇదే టాలీవుడ్ ఇండస్ట్రీలోని లొసుగులను కూడా బయటపెడుతోంది.
రాజకీయ ఎన్నికలను తలపిస్తూ.. 'మా' అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఇటీవలే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మంచు విష్ణు సభ్యులపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మంచు విష్ణు సభ్యులపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో విష్ణుకు, ప్రకాష్ రాజ్ కు మద్య వ్యక్తిగత వైరంగా మారిపోయింది.
తాజాగా మంచు విష్ణు మీడియా సమావేశం పెట్టి ఏకంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. 'మా ఎన్నికలకు తన కుటుంబాన్ని లాగొద్దని.. తన తండ్రి పేరును తీయొద్దని సూచించాడు. అలాగే ప్రకాష్ రాజ్ కు బీపీ టాబ్లెట్ ఇవ్వాలని.. ఆయన ఒక అపరిచితుడుగా మాట్లాడుతున్నాడని.. నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నాడని మంచు విష్ణు ఆరోపించాడు. మొసలి కన్నీరు కారుస్తున్నారని.. డ్రామాలు చేస్తున్నారని.. ఎలాక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వద్దు.. బ్యాలెట్ పేపర్ కావాలి అని వాళ్లు అంటున్నారని మంచు విష్ణు తెలిపారు.
బ్యాలెట్ పేపర్ కోసం ఎన్నికల అధికారికి లెటర్ పెట్టామని.. మేం గెలిచిన తర్వాత మళ్లీ ట్యాంపర్ చేశారని అంటారు.. పేపర్ బ్యాలెట్ అయితే ఎన్ని సార్లు అయినా లెక్కపెట్ట వచ్చని విష్ణఉ తెలిపారు.
అక్టోబర్ 10 తర్వాత మళ్లీ అందరం ఒక్కటేనని..తన కుటుంబం గురించి కానీ.. తన ప్యానల్ గురించి కానీ తప్పుగా మాట్లాడవద్దని ప్రకాష్ రాజ్ వర్గాన్ని మంచు విష్ణు హెచ్చరించారు. 'యాక్టింగ్ డ్రామా అంతా కెమెరా ముందు పెట్టాలని.. మీడియా ముందు వద్దంటూ ప్రకాష్ రాజ్ 'పై విష్ణు సెటైర్లు వేశారు. జీవిత గారు మీరు మా నాన్న గారి పేరు తీస్తే నేను తీస్తానని.. బజారుకు ఇడుస్తా అంటూ మంచు విష్ణు హెచ్చరించాడు.
శ్రీహరి బతికుంటే ప్రకాష్ రాజ్ బండారం బయటపడేదని విష్ణు అన్నారు. 'మా నాన్న కాళ్లకు దండం పెట్టింది మార్చిపోయారా? 'వస్తాడు నారాజు' షూటింగ్ లో మా డైరెక్టర్ ను తిట్టారు.. నాకు మా నాన్న సపోర్ట్ ఉంది.. అందరూ సపోర్టు చేస్తున్నారని భయపడుతున్నారు.. చివరి హెచ్చరికగా చెబుతున్నారు.. మీరు చేసే ఆరోపణలు మాట్లాడే మాటలు 10వ తేదీ తర్వాత బాగుండదు' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు మంచు విష్ణు