`సాహో` ఫేం మందిరా భేడీ భ‌ర్త ఆక‌స్మిక‌ మృతి

Update: 2021-06-30 07:31 GMT
`సాహో` ఫేం .. టీవీ మూవీ న‌టి మందిరా భేడి భర్త రాజ్ కౌషల్ (49) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు రాజ్ కు గుండెపోటు వచ్చింది. స‌మ‌యానికి స్పందించి ఆస్ప‌త్రికి త‌ర‌లించినా ఆయ‌న ఈలోగానే తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం ముంబైలోని శివాజీ గ్రౌండ్ లో జరిగాయి. ఆయ‌న‌కు తుది నివాళులు అర్పించిన వారిలో రోహిత్ సోదరుడు రోనిత్ రాయ్ - నటుడు ఆశిష్ చౌదరి ఉన్నారు. నేహా ధూపియా- అనుపమ్ ఖేర్ - రోనీ స్క్రూవాలా- సుధీర్ మిశ్రా స‌హా పలువురు ప్ర‌ముఖులు రాజ్ కౌషల్ మరణానికి సంతాపం తెలిపారు.

రాజ్ కౌషల్ ఒక యాడ్ ఫిల్మ్ మేకర్. 1998 లో ప్రకటనల నిర్మాణ సంస్థను స్థాపించి దాదాపు 400 పైగా వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించారు. రాజ్ తన కెరీర్లో మూడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్యార్ మెయిన్ కబీ కబీ- షాదీ కా లడూ- ఆంథోనీ కౌన్ హై వంటి చిత్రాలను తెర‌కెక్కించారు.

మందిరా - రాజ్14  ఫిబ్రవరి 1999 న వివాహం చేసుకున్నారు. 2011 లో ఓ కుమారుడు జన్మించాడు. అతనికి వీర్ అని పేరు పెట్టారు. అక్టోబర్ 2020 లో మందిరా - రాజ్ నాలుగేళ్ల ఆడపిల్లని దత్తత తీసుకున్నారు. రాజ్ కన్నుమూసిన విషయం తెలుసుకుని ప్రకటనల రంగంలోని ఆయ‌న స‌న్నిహితులు షాక్ కి గుర‌య్యారు. హిందీ చిత్ర‌సీమ స‌హా బుల్లితెర రంగం నుంచి మందిర‌కు సానుభూతి వ్య‌క్త‌మైంది. ఓరి దేవుడా! అంటూ న‌టి దివ్యా ద‌త్తా షాక్ కి గుర‌య్యారు. చాలా మందికి  కెరీర్ లను సృష్టించాడు. అంతకు మించి అతను ఎప్పుడూ తన స్నేహితులతోనే నిలబడ్డాడు.. అంటూ రాజ్ స‌న్నిహితులు వాపోయారు.
Tags:    

Similar News