మందిర చెబుతున్న మాఫియా స్టోరీ

Update: 2017-07-08 08:54 GMT
టీవీ యాక్ట్రెస్ మందిరా బేడీకి బోలెడంత పాపులారిటీ ఉంది. బుల్లితెరపై నటిస్తూనే.. క్రికెట్ మ్యాచ్ లకు యాంకరింగ్ చేయడం ద్వారా.. తన క్రేజ్ ను విపరీతంగా పెంచుకున్న మందిర.. ఆ తర్వాత సినిమాల్లో కూడా కనిపించి మెప్పించింది. టీవీ నుంచి సినిమాలకు ఈమె.. ఇప్పుడు డిజిటల్ మీడియాలో కూడా హల్ చల్ చేసేస్తోంది.

శాంతి.. క్యోంకి సాస్ భీ కభీ బహు థీ వంటి సీరియల్స్ తో ప్రేక్షకులను అలరించిన మందిరా బేడి ప్రస్తుతం స్మోక్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో మాఫియా డాన్ భార్యగా నటిస్తోందట. 'నేను టీవీ.. డిజిటల్.. రెండు ప్లాట్ ఫామ్స్ కి వర్క్ చేశాను. ఫిర్ ఏక్ బార్.. డ్యూస్.. ది గిఫ్ట్.. వంటి షార్ట్ ఫిలిమ్స్ చేయగా.. ఇప్పుడు స్మోక్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాను. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాం కు క్రేజ్ పెరుగుతోంది. ఆన్ లైన్ కంటెంట్ కు తక్కువ సమయం పడుతుంది. అలాగే.. కొత్త ఆలోచనలను కాన్సెప్ట్ లను ఆడియన్స్ కు చూపేందుకు అవకాశం ఉంటుంది' అని చెబుతోంది మందిరా బేడి.

"టీవీల్లో చూపించే కంటెంట్ కొంత సేఫ్ గాను.. నియమాలకు లోబడి ఉంటుంది. ఒక్కోసారి నెలకు 25-28 చొప్పున పని చేయాల్సి ఉంటుంది. ఏళ్ల తరబడి కొనసాగిన సీరియల్స్ ను కూడా మనం చూస్తున్నాం" అని చెప్పిన మందిరా బేడీ.. స్మోక్ వెబ్ సిరీస్ లో జిమ్ సరభ్.. కల్కి కొచ్లిన్.. టామ్ ఆల్టర్.. నీల్ భూపాలం వంటి యాక్టర్స్ తో కలిసి నటించినట్లు తెలిపింది. ఈ వెబ్ సిరీస్ మొత్తం 10 నుంచి 12 భాగాలు ఉంటుందట.


Tags:    

Similar News