తమిళ్ బాహుబలి అంటూ ప్రచారం జరుగుతున్న పొన్నియిన్ సెల్వన్ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళంతో పాటు సౌత్ లో అన్ని భాషల్లో ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. ముఖ్యంగా తమిళంతో పాటు హిందీ మరియు తెలుగు లో సినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకుంటుందనే నమ్మకంగా చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా సినిమా కు సంబంధించిన ప్రెస్ మీట్ లు మరియు ఇంటర్వ్యూలను మణిరత్నం ఆధ్వర్యంలో చిత్ర యూనిట్ సభ్యులు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. త్రిష మరియు ఐశ్వర్య రాయ్ లతో పాటు హీరోలు మరియు ఇతర టెక్నీషియన్స్ సినిమా యొక్క ప్రమోషనల్ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మణిరత్నం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐశ్వర్య రాయ్ మరియు త్రిషల మధ్య సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చాలా సమస్య ఏర్పడిందని ఆయన అన్నాడు. ఇద్దరు కూడా చాలా సీరియస్ గా ఎదురు పడ్డ సమయంలో ఉండాలి.. అలా ఉండేందుకు వారికి కాస్త కష్టం అయ్యింది.
వారిద్దరి మధ్య సన్నివేశాల్లో చాలా సీరియస్ నెస్ ను కల్పించేందుకు కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చిందని మణిరత్నం అన్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో వారిద్దరిని కలవనివ్వలేదు. ఇద్దరూ కూడా షూటింగ్ పూర్తి అయ్యే వరకు కలవకూడదు అని వార్నింగ్ ఇచ్చాడట.
ఇద్దరు కలిసి ఆ తర్వాత సీరియస్ గా నటించమంటే కష్టం అయ్యేదట. అందుకే వారిద్దరిని సాధ్యం అయినంత వరకు షూటింగ్ ముగిసే వరకు కలవనివ్వలేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా అద్భుతం గా వచ్చింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వెయ్యి కోట్ల వసూళ్లు లక్ష్యంగా ఈ సినిమా విడుదల కాబోతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.