మణి శర్మ సత్తా గుర్తించినట్లేనా

Update: 2017-04-07 17:30 GMT
మెలోడీ బ్రహ్మగా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు మణిశర్మ. గతంలో ఈయన టాలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. కొత్త తరం రావడంతో రేసులో వెనకబడిపోయినా.. ఇప్పటికీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఈయనే ఫస్ట్ ఛాయిస్. టెంపర్.. సీతమ్మ వాకిట్లో సిరిమెల్లె చెట్టు వంటి చిత్రాలకు ఆర్ఆర్ ఇచ్చింది ఈయనే.

చిరు.. బాలయ్య.. నాగ్.. వెంకీల నుంచి పవన్.. మహేష్.. రామ్ చరణ్ వరకు రెండు తరాల హీరోలకు సంగీతం అందించాడు మణిశర్మ. మళ్లీ ఇప్పుడు మణి మ్యూజిక్ కు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది నాని హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన జంటిల్ మ్యాన్ మూవీకి.. సంగీతం ఆయువుపట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్న తర్వాత.. మణిశర్మకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈయన చేతిలో అరడజన్ ప్రాజెక్టుల వరకూ ఉండడం విశేషం.

వంశీ రూపొందిస్తున్న 'ఫ్యాషన్ డిజైనర్'.. ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న 'అమీ తుమీ'.. హను రాఘవపూడి-నితిన్ ల 'లై'.. జయంత్ సి పరాన్జీ మూవీ 'జయదేవ్'.. నారా రోహిత్-పవన్ మల్లెల మూవీలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు మణిశర్మ ఖాతాలో ఉన్నాయి. మీడియం బడ్జెట్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నా.. మరోసారి మణిశర్మ టాప్ హీరోలకు సంగీతం అందించే స్థాయిని అందుకోవడానికి ఎక్కువకాలం పట్టకపోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News