ఇస్మార్టుకు ప్లస్సుగా మారిన మణి శర్మ

Update: 2019-07-19 05:31 GMT
అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన 'ఇస్మార్ట్ శంకర్' ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. మౌత్ టాక్ రివ్యూలు బైటకు వచ్చేశాయి.  వాటితో సంబంధం లేకుండా మొదటి రోజు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  సినిమా పట్ల మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ రెండు మూడు అంశాల్లో మాత్రం ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి.

అందులో ఒకటి రామ్ పెర్ఫార్మెన్స్. రామ్ పాత్ర  తెలంగాణా యాస సరిగా లేదని కొన్ని విమర్శలు ఉన్నాయి కానీ రామ్ తనను తాను పూరి స్టైల్ కు తగ్గట్టుగా మాస్ హీరోగా మలుచుకున్న తీరు.. ఆ ఎనర్జీకి అందరూ ఫిదా అవుతున్నారు.   రామ్ లో ఎనర్జీ ఫుల్ గా ఉంది కాబట్టే.. 'ఎనర్జిటిక్ స్టార్' అని పిలుస్తూ ఉంటారు.. కానీ ఆ ఎనర్జీని 'రెడీ' లాంటి ఒకటి అరా సినిమాల్లో తప్ప ఎవరూ పెద్దగా వాడుకోలేక పోయారు.  పూరి జగన్ మాత్రం ఆ ఎనర్జీని పూర్తిగా వాడుకున్నాడు.  నిజానికి పూరి దర్శకత్వంపై పెదవి విరుస్తున్న జనాలు కూడా రామ్ ను ఇలా ప్రెజెంట్ చేయడంలో మాత్రం పూరికి ఫుల్ క్రెడిట్ ఇస్తున్నారు.  

మరో అంశం ఏంటంటే మణిశర్మ సంగీతం.  పూరి తన ఓల్డ్ ఫార్మాట్లోనే ఈ సినిమాను తెరకెక్కించినా.. ప్రిడిక్టబుల్ గా మార్చినా పలు సీన్లలో మణి శర్మ సంగీతం... ఆ సీన్లను నిలబెట్టిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  ఇష్ ఇష్ ఇస్మార్ట్ అనే హమ్మింగ్ ను కంటిన్యూ చేస్తూ ఆడియన్స్ ను ఒక రకంగా మెస్మరైజ్ చేశాడు. అద్భుతమైన నేపథ్య సంగీతంతో పాటుగా ఫుల్ జోష్ ఉన్న మూడు పాటలు కంపోజ్ చేసి సినిమాకు ఒక పెద్ద బలంలా నిలిచాడు.  అయితే మెలోడీ బ్రహ్మ పేరుకు తగ్గట్టు ఒక సూపర్ మెలోడీని మాత్రం అందించలేకపోయాడు.  ఓవరాల్ గా సినిమా మ్యూజిక్ ను చూస్తే మాత్రం మణిశర్మ ఫామ్ లోకి వచ్చినట్టే. ఆయన అభిమానులకు ఇది సంతోషాన్నిచ్చే విషయమే.

    

Tags:    

Similar News