మరో విషాదం: ఆ ప్రముఖ సీరియల్ నటి హఠాన్మరణం

Update: 2021-10-03 09:30 GMT
వయసు మళ్లిన వారు.. జీవితంలో డాక్కామొక్కీలు తిన్న వారు కాలం చేస్తే కాస్తంత బాధకు గురైనా.. పుట్టినవాడు గిట్టకమానడన్న సత్యాన్ని గుర్తు తెచ్చుకొని సర్దిచెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా  థర్టీ ప్లస్ కూడా రాకముందే.. పుటుక్కున కాలం చేస్తే అది షాకింగ్ గా ఉంటుంది. అందునా.. సెలబ్రిటీలకు ఇలాంటి మరణాలు ఎదురైతే ఒక పట్టాన మింగుడుపడని రీతిలో ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితే  మరోసారి హిందీ టీవీ పరిశ్రమకు ఎదురైంది.

గత నెలలో బిగ్ బాస్ విజేత.. బాలిక వధు సీరియల్ ఫేం సిద్దార్థ్ శుక్లా గత నెలలో హటాత్తుగా మరణించటం చాలామందికి దిమ్మ తిరిగిపోయే షాక్ ను ఇచ్చింది. ఈ విషాదం నుంచి ఇంకా బయటకు రాక ముందే.. తాజాగా హిందీ టీవీ పరిశ్రమకు చెందిన మరో నటి హఠాన్మరణానికి గురి కావటం షాకింగ్గ గా మారింది. జీ టీవీలో 'జోధా అక్బర్'లో సలీమా బేగం పాత్రను పోషించిన టీవీ నటి మనీషా యాదవ్ శుక్రవారం మరణించారు.

ఆమె మరణానికి కారణం.. మెదడులో రక్తస్రావం జరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని మరో టీవీ నటి పరిధి శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవటంతో ఆమె మరణం బయటకు వచ్చింది. జోధా అక్బర్ షో తర్వాత ఆమెతో తాను అంతగా టచ్ లో లేనని.. అందులో నటించిన వారంతా కలిసి మొఘల్స్ అనే పేరుతో ఒక వాట్సాప్ గ్రూపును తయారు చేసుకున్నామని చెప్పారు.

తాజాగా ఆ గ్రూపులో మనీషా మరణం గురించి సమాచారం తెలియటంతో షాక్ తిన్నట్లు చెప్పారు. ఆమెకు ఏడాది వయసున్న కొడుకు ఉన్నారని.. ఆ బాబు గురించి ఆలోచిస్తే ఎంతో ఆందోళనతో ఉన్నట్లు వేదనను వ్యక్తం చేసింది.దీనికి సంబంధించిన సమాచారాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు.
Tags:    

Similar News