ఎక్కడైనా ఉన్న గోల ఇదే. మన హీరోయిన్లను మనం పిలవం. పక్కింటి పుల్లకూరలు మాత్రం తెగ రుచిగా ఉంటాయ్. మామూలుగా మన తెలుగు అమ్మాయిలను టాలీవుడ్ లో ఎంకరేజ్ చేయట్లేదు అనేది ఎంత నిజం అనుకుంటే.. వేరే బాషల్లో కూడా లోకల్ అమ్మాయిలను ఎంకరేజ్ చేయని మాట నిజమే అను అనుకోవాలి.
ఫర్ సప్పోజు.. నయనతారు ఉంది.. తెలుగులో ఏలింది. ఇప్పుడు తమిళంలో తుళ్లింతలు పుట్టిస్తోంది. కాని మలయాళంలో? అంత సీన్ లేదు. ఏదో అప్పుడప్పుడూ మెరవడమే. పుట్టి పెరిగిన మథర్ టంగ్ లో సినిమాలు వానలా పడట్లేదు అమ్మడికి. త్రిష - సమంత - శృతిహాసన్ లను తమిళంలో కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కాని.. రెజీనా వంటి చాలామంది తమిళమ్మాయిలు తెలుగు - మలయాళం మీద ఫోకస్ పెట్టారు.
ఇకపోతే కొత్త పిల్ల మంజిమా మోహన్ ఉంది చూశారు.. సాహసం స్వాసగా సాగిపో సినిమాతో మన తెర మీద తొలిసారి కనబడనుంది. అమ్మడు చైల్డ్ ఆర్టిస్టుగా మల్లూవుడ్ లో ఫ్యామిస్. కాని తమిళ-తెలుగు బైలింగువల్ సైన్ చేసింది అనగానే అస్సలు మల్లూ బాబులూ పిలిస్తే ఒట్టు అంటోంది. ఎలాగో అక్కడ రెమ్యూనరేషన్లు తక్కువే కాబట్టి.. ఈమె కూడా ఇక్కడే తిష్ట వేసేద్దాం అనుకుంటుందా? అబ్బే లేదు.. మా వాళ్లు నన్ను పిలవట్టేదు నాయనోయ్ అంటోంది.
ఏదేమైనా ఈ సినిమాలంటే అంతేనేమో.. హీరోలనే కాని.. హీరోయిన్ల విషయానికొస్తే.. బాలీవుడ్ లో తప్పిస్తే అందరికీ పొరుగింటి పుల్లకూరే రుచి అనుకుంట!!