టాలీవుడ్ లో నవతరం నాయికల స్పీడ్ కొనసాగుతోంది. రకూల్ - రాశీఖన్నా - కృతి సనోన్ - ప్రగ్యా జైశ్వాల్ .. ఇలా భామలంతా వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీ నాయికలయ్యారు. ఇప్పుడు అదే బాటలో మరో కొత్త భామ టాలీవుడ్ కి వస్తోంది. పేరు మంజిమా మోహన్. టాలీవుడ్ లవర్ బోయ్ నాగచైతన్య సరసన కథానాయికగా నటిస్తోంది. సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో తెలుగువారికి పరిచయం అవుతోంది. గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తన డెబ్యూ గురించి , నాగచైతన్య గురించి చిలక పలుకులు పలికిందీ ముద్దుగుమ్మ.
గౌతమ్ మీనన్ నేను నటించిన ఓ మలయాళ చిత్రం చూసి నన్ను ఈ ద్విభాషా చిత్రానికి ఎంపిక చేసుకున్నారు. ఆయన శైలిలోనే నా క్యారెక్టరైజేషన్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందీ చిత్రంలో. ఓ పక్కింటి అబ్బాయి స్టోరీ ఇది. హీరోకి బైక్స్ అంటే చాలా ఇష్టం. అనుకోకుండా ఓ ఆపదలో చిక్కుకుంటాడు. ఆ తర్వాత సిట్యుయేషన్ ఎటెళ్లింది అన్నదే సాహసం శ్వాసగా సాగిపో చిత్రం... అంటూ చెప్పుకొచ్చింది.
నాగచైతన్య గురించి చెబుతూ .. అతడు వెరీ సింపుల్. డౌన్ టు ఎర్త్. ఈ చిత్రంలో ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాడు. ఆన్ సెట్స్ రకరకాల అనుభవాలున్నాయి మా మధ్య. తను మంచి ఫుడ్డీ... అదే తిండిబోతు. కానీ అనవసరమైన ఆయిల్ ఫుడ్స్ తినడు. అంతెందుకు నాకు ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ ని కూడా వద్దనే అంటాడు. నేను స్వతహా ఐస్ క్రీమ్ ని ఎక్కువగా ఇష్టపడతాను. కలిసే తిందాం అంటే వినడు.. అంటూ చెప్పుకొచ్చింది. అరెరే చేతిలోంచి ఐస్ క్రీమ్ లాక్కుని దూరంగా విసిరేసాడా ఏం?