`మ‌న్మ‌ధుడు 2` తొలి రోజు వ‌సూళ్లు

Update: 2019-08-10 08:27 GMT
నాగార్జున - ర‌కుల్ ప్రీత్ జంట‌గా రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `మ‌న్మ‌ధుడు 2` ఆగ‌స్టు9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి నెగెటివ్ టాక్ వ‌చ్చింది. కామెడీ ఆక‌ట్టుకున్నా ఏజ్ బార్ రొమాన్స్ ఎక్క‌డో లెక్క త‌ప్పింద‌ని సెటైర్లు వేశారు. సోష‌ల్ మీడియాలోనూ విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. తాజాగా తొలి రోజు వ‌సూళ్ల వివ‌రాలు తెలిశాయి.

`మ‌న్మ‌ధుడు 2` డే వ‌న్ షేర్ వ‌సూళ్లు ప‌రిశీలిస్తే.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రీమియ‌ర్లు క‌లుపుకుని ఈ చిత్రం 5.03కోట్లు షేర్ వ‌సూలు చేసింది. నైజాం-1.18 కోట్లు, సీడెడ్- 45ల‌క్ష‌లు.. ఆంధ్రా -2.09కోట్లు వ‌సూలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.73కోట్లు వ‌సూళ్లు ద‌క్కాయి. క‌ర్నాట‌క నుంచి 62 ల‌క్ష‌లు (40ల‌క్ష‌ల హైర్స్ ఉన్నాయి), ఇత‌ర భార‌త దేశం నుంచి 25ల‌క్ష‌లు వ‌సూలు చేయ‌గా.. అమెరికా నుంచి ప్రీమియ‌ర్లు క‌లుపుకుని కేవ‌లం 30ల‌క్ష‌లు మాత్ర‌మే వ‌సూలైంది. ఉత్త‌రాంధ్ర‌-46ల‌క్ష‌లు.. తూ.గో జిల్లా-35ల‌క్ష‌లు.. ప‌.గో జిల్లా-28ల‌క్ష‌లు..కృష్ణ‌-28ల‌క్ష‌లు.. గుంటూరు-54ల‌క్ష‌లు.. నెల్లూరు-18ల‌క్ష‌లు లెక్క తేలింది. ఓవ‌రాల్ గా 4.89కోట్లు తొలిరోజు వ‌సూలైంది. గ్రాస్ ప‌రంగా చూస్తే 8.01కోట్లు వ‌సూలైంది.

తొలిరోజు మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మైంది కాబ‌ట్టి మునుముందు వ‌సూళ్లు ఎలా ఉంటాయి? అన్నది చూడాలి. సెల‌వులు క‌లిసొచ్చినా టాక్ డివైడ్ రావ‌డం అన్న‌ది మ‌న్మ‌ధుడికి ప‌రీక్ష లాంటిదే. బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? అంటే అది అంత సులువేం కాద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. ఈ వీకెండ్ రిపోర్ట్ వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News