మన్మథుడు హీరోయిన్ ఏమైందంటే..

Update: 2017-06-04 09:38 GMT
నాగార్జున హీరోగా విజయ భాస్కర్ డైరక్షన్లో రూపొందిన ''మన్మథుడు'' సినిమా ఎంతో పెద్ద హిట్. ఆ సినిమా నాగ్ కు కొత్త ట్యాగ్ ఇవ్వడమే కాదు.. దేవిశ్రీప్రసాద్ కు పెద్ద బ్రేక్ ఇచ్చింది. అలాగే త్రివిక్రమ్ డైలాగ్స్ కు కూడా చాలా పేరొచ్చింది. ఇక తొలిసారిగా హీరోయిన్ గా చేసిన అన్షు (అన్షు అంబాని) కూడా చాలా పాపులార్టీ తెచ్చుకుంది. ఆ తరువాత రెండు మూడు సినిమాలు చేసిన అన్షు టాలీవుడ్ నుండి మాయమైపోయింది. ఇంతకీ ఈ అమ్మాయి ఏమైనట్లు?

మన్మథుడు.. రాఘవేంద్ర వంటి సినిమాల్లో నటించిన అన్షు.. నిజానికి ఒక ఎన్నారై. అమ్మడు అప్పట్లో తిరిగి లండన్ వెళ్ళిపోయి తన చదువులు తన చదువుకుందట. సినిమా పరిశ్రమలో రాణించడం చాలా కష్టం అని ఫీలై.. ఈ ఫీల్డ్ వదిలేసిందట. ఇకపోతే ప్రస్తుతం ఆమె లండన్‌లో ఓ డిజైనర్‌ దుస్తుల దుకాణం నడుపుతోంది. 'ఇన్‌ స్పిరేషన్‌ కౌచర్' అంటూ ఆమె నడిపే దుకాణంలో బాలీవుడ్ హీరోయిన్లు ధరించిన డ్రస్సులకు దగ్గరగా ఉండే డూప్లికేట్ డిజైన్లను తయారు చేసి అమ్ముతారట. లండన్‌ లోనే పుట్టి పెరిగిన అన్షు అక్కడే ఉంటున్న సచిన్‌ సగ్గార్ అనే వ్యాపారిని పెళ్లి చేసుకుని అన్షు సగ్గార్ గా మారిపోయింది.

మొత్తానికి కొందరు హీరోయిన్లు ఎంత ఫేమ్ వచ్చినా కూడా.. అదంతా కాదనుకుని.. సింపుల్ గా బ్రతకడానికే ఇష్టపడతారు. ఈ మధ్యనే రిచా గంగోపాధ్యాయ కూడా ఇదే విధంగా కొన్ని సినిమాల్లో చేసి జంప్ అయిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News