నా రెండో పెళ్లికి న‌న్ను కూడా పిల‌వండి!-మంచు మ‌నోజ్

Update: 2021-10-27 04:35 GMT
అవును.. నా రెండో పెళ్లికి న‌న్ను కూడా పిల‌వండి! అంటూ వ్య‌గ్యాస్త్రం విసిరాడు మంచు మ‌నోజ్. మీ ఇష్టం రా మీ ఇష్టం! అంటూ న‌వ్వుతూ ఉన్న ఈమోజీల్ని కూడా స‌ర‌దా ట్వీట్ లో షేర్ చేశాడు. త‌న విడాకుల వ్య‌వ‌హారం అనంత‌రం దీనిపై మ‌నోజ్ ఇప్పుడు నెటిజ‌నుల్లో జ‌రుగుతున్న ప్ర‌చారంపై స్పందిస్తున్నాడు. మ‌నోజ్ కి రెండో పెళ్లి అని కుటుంబ స‌భ్యులు పిల్ల‌ను వెతికార‌ని సాగుతున్న ప్ర‌చారానికి అత‌డు త‌న‌దైన శైలిలో కౌంట‌ర్లు వేశాడు. మనోజ్ ఒక విదేశీ యువతితో ప్రేమలో ఉన్నా దానిని కాద‌ని డాడీ మోహన్ బాబు తన కుటుంబంలోని ఒకరితో మనోజ్ కు రెండో పెళ్లి జరిపించాలని ప్లాన్ చేస్తున్నాడని ప్ర‌చారం సాగుతోంది.

త‌న‌పై తామ‌ర‌తంప‌ర‌గా వ‌స్తున్న ఇలాంటి క‌థ‌నాల్ని షేర్ చేస్తూ .. మనోజ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వ్యంగ్యంగా స్పందించారు. ``దయచేసి నా పెళ్లికి నన్ను కూడా ఆహ్వానించండి … పెళ్లి ఎక్కడ ఉంది.. ? ఎవ‌రా బుజ్జి పిల్ల.. తెల్ల పిల్ల ?! మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం`` అంటూ బ్రహ్మానందం అయోమ‌యంలో ఉన్న ఓ ఫ‌న్నీ ఫోటోను ట్వీట్ కి జోడించారు.

ప్ర‌ణ‌తి రెడ్డి అనే హైద‌రాబాదీ యువ‌తిని మ‌నోజ్ ప్రేమించి పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లాడారు. 2015లో ఈ జంట పెళ్ల‌యింది. కానీ ఆ త‌ర్వాత నాలుగేళ్ల‌కే విడిపోయారు. 2019లో విడాకుల ప్ర‌క‌ట‌న అనంత‌రం మ‌నోజ్ సినిమాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించి షాకిచ్చారు. కానీ ఆ త‌ర్వాత కుటుంబ స‌భ్యులు అత‌డిని స‌ముదాయించడంతో తిరిగి సినిమాల్లో కొన‌సాగుతున్నారు. ప్రస్తుతం సొంత బ్యాన‌ర్ ఎంఎం ఆర్ట్స్ ని స్థాపించి మంచు మనోజ్ `అహం బ్రహ్మాస్మి` అనే సినిమా చేస్తున్నారు. క‌రోనా క్రైసిస్ వ‌ల్ల ఈ సినిమా మేకింగ్ ఆల‌స్య‌మైంది. త్వ‌ర‌లోనే అప్ డేట్ తో వ‌స్తాడ‌ని తెలుస్తోంది. ఇక ఇటీవ‌లే మ‌నోజ్ సోద‌రుడు మంచు విష్ణు మూవీ ఆర్టిస్టుల ఎన్నిక‌ల్లో గెలిచి `మా`కు అధ్య‌క్షుడైన సంగ‌తి తెలిసిందే. అన్న‌య్య‌కు త‌మ్ముడు బోలెడంత ప్ర‌చారం చేశారు. ఎల‌క్ష‌న్ అనంత‌రం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ని క‌లిసి అత‌డు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.
Tags:    

Similar News