మా ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే ప్రకాష్ రాజ్ హడావుడి చేశాడు. ఆ సమయంలోనే బండ్ల గణేష్ ఆయన వెనుక ఉన్నాడు. ప్రకాష్ రాజ్ కు తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు. ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున బండ్ల గణేష్ కూడా పోటీకి సిద్దం అవుతున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ ప్యానల్ లో జీవిత రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చారో వెంటనే తాను బయటకు వెళ్లి పోతున్నట్లుగా ప్రకాష్ రాజ్ కు తెలియజేసి మరీ సొంతంగా ఎన్నికల్లో పోటీ చేస్తాను అంటూ ప్రకటించాడు. ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున జీవిత జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో తాను కూడా అదే పదవి కోసం పోటీ పడేందుకు సిద్దం అయ్యాడు. నామినేషన్ కూడా వేసి ప్రచారం మొదలు పెట్టిన బండ్ల గణేష్ అనూహ్యంగా తప్పుకోవడంతో చర్చనీయాంశం అయ్యింది. బండ్ల గణేష్ తప్పుకోవడం ను ఇప్పుడు చాలా మంది సమర్థిస్తున్నారు.
మా ఎన్నికల్లో బండ్ల గణేష్ తప్పుకోవడం మంచిదే అయ్యింది. ఈ రచ్చ కంపు రాజకీయ తరహా మా ఎన్నికల్లో బండ్ల గణేష్ కూడా ఉండి తన పరువును పోగొట్టుకోలేదు అంటూ కొందరు ఆయన సన్నిహితులు మరియు అభిమానులు అంటున్నారు. ఈ రొంపి ఎన్నికల్లో పోటీ చేయనందుకు అభినందనలు బండ్ల గణేష్ అన్న అంటూ ఒక వ్యక్తం చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారికి ఎన్నికలు వదిలేసినా వచ్చేసారికి మీరు ఒక ప్యానల్ ను ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యేందుకు పోటీ పడాలంటూ కొందరు బండ్ల గణేష్ కు సూచిస్తున్నారు. మొత్తానికి బండ్ల గణేష్ ఈ ఎన్నికల నుండి తప్పుకున్న నేపథ్యంలో ఆ పోస్ట్ కు ఎవరు ఎన్నిక అవుతారు అనేది ఆసక్తిగా మారింది.
తాను నామినేషన్ వేసి విత్ డ్రా చేసుకున్న జనరల్ సెక్రటరీ పోస్ట్ కు గాను ఇప్పుడు జీవిత మరియు రఘు బాబులు పోటీ పడుతున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి జీవిత ఉండగా.. మంచు విష్ణు ప్యానల్ నుండి రఘు బాబు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో తన మద్దతు విషయంలో బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చాడు. ప్యానల్ పరంగా ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నా కూడా ఆ ఒక్క పోస్ట్ విషయంలో మాత్రం రఘు బాబుకు అవకాశం ఇవ్వండి అంటూ సోషల్ మీడియా ద్వారా మా సభ్యులకు విజ్ఞప్తి చేశాడు. ట్విట్టర్ లో బండ్ల గణేష్ పోస్ట్ కు చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. ఎక్కువ శాతం మంది బండ్ల గణేష్ ను సమర్థిస్తూ కామెంట్స్ చేయడం జరిగింది.