పెళ్లి ఒక కంపెనీ లాంటిది! అని సీనియర్ నటి టబు ఏ సందర్భాన స్టేట్ మెంట్ ఇచ్చిందో కానీ, నిజంగానే అదో కంపెనీ వ్యవహారమే అయిపోయింది. వరుసగా పెళ్లి కాన్సెప్టుపై సినిమాలు తీసి డబ్బులు దండుకోవాలనుకోవడం కళ్లముందు కనిపిస్తోంది. అయితే డబ్బు కోసం తీసినా.. ఈ పెళ్లిళ్ల సినిమాల్లో కొన్ని విలువల్ని చూపించే ప్రయత్నం సాగుతోంది. మ్యారేజ్ ఇనిస్టిట్యూషన్ అని నమ్మేవాళ్లకు పెళ్లి చేసుకోవాలన్న కోరికను కలిగిస్తామని నితిన్ - దిల్ రాజు లాంటివాళ్లు చెబుతున్నారు. అందుకే వీళ్లు `శ్రీనివాస కళ్యాణం` లాంటి మ్యారేజ్ కాన్సెప్ట్ సినిమాని ఎంపిక చేసుకున్నారు. రాశీని వెండితెర సాక్షిగా ఆన్ లొకేషన్ పెళ్లాడేసిన నితిన్.. అసలు ఇన్నాళ్లు బ్యాచిలర్ గా ఎందుకున్నాన్రో బాబోయ్.. వెంటనే పెళ్లి చేసేయండి ప్లీజ్! అని అమ్మా నాన్నను అడిగేశాడట! మొన్నటి ప్రమోషనల్ ఈవెంట్ లో నితిన్ ఇలా అన్నాడంటే.. ఇదేదో మంచి ప్రయత్నమేనని నమ్మాల్సొస్తోంది.
ఈ సినిమానే కాదు.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా పెళ్లి కాన్సెప్టుపై సినిమాలొస్తున్నాయి. ఇటీవలే నిహారిక `హ్యాపి వెడ్డింగ్` రిలీజైంది. నిశ్చితార్థం వరకూ ఒక జంట మధ్య మదనం - అంతర్మధనం నేపథ్యంలో ఈ సినిమా ఆసక్తికర పాయింట్ తో తెరకెక్కింది. జయాపజయాల మాట ఎలా ఉన్నా నిహారికకు మంచి పేరు తెచ్చిన సినిమా ఇది. నిహారిక హ్యాపి వెడ్డింగ్ - నితిన్ శ్రీనివాస కళ్యాణం (ఆగస్టు9 బొమ్మరిల్లు రిలీజ్ తేదీన వస్తోంది) గురించి ముచ్చటించుకుంటుండగానే, సుశాంత్ చి.ల.సౌ అనే పెళ్లి కాన్సెప్ట్ సినిమాతో ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎట్టి పరిస్థితిలో సుశాంత్ నిరూపించుకోవాల్సిన సన్నివేశంలో ప్రమోషన్ ని అంతే ఎగ్రెస్సివ్ గా చేస్తున్నారు.
అపుడెపుడో కె.రాఘవేంద్రరావు శ్రీకాంత్ హీరోగా `పెళ్లిసందడి` తీశాడు.. కానీ ఇటీవల పెళ్లిపై సినిమాలు తగ్గాయ్ అనుకుంటుండగానే వరుసగా పెళ్లిపై సినిమాలు రావడం యూత్‌లో ఉత్సాహం పెంచుతోంది. పెళ్లి కమర్షియల్ గా మారిన ఈ రోజుల్లో ఈ వేడుకకు విలువలు ఆపాదించి చేసే ప్రయత్నం మెచ్చదగినదే. పెళ్లి అన్న మాటెత్తితేనే రివర్స్ గేర్ లో వెళుతున్న బ్యాచిలర్స్ కి పెళ్లాడాలన్న పాజిటివ్ థింకింగ్ తెప్పిస్తాయో ఏమో!!