చావు కూడా బ్రాండేన‌ట‌!

Update: 2018-07-29 07:17 GMT
మారుతి అంటేనే ఒక బ్రాండ్‌! ఆయ‌న ప్రేమ‌క‌థా చిత్రమ్‌ - భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌ - మ‌హానుభావుడు వంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్‌ బ్రాండ్  సినిమాలు తీశాడు. అంత‌కుముందు ఈరోజుల్లో - బ‌స్‌ స్టాప్‌ తో వ‌చ్చిన బూతు బ్రాండ్‌ ని చెరిపేసుకున్నాడు. ఆ క్ర‌మంలోనే చాలా కాలం త‌ర్వాత పూర్తి స్థాయిలో అత‌డు దృష్టి పెట్టి క‌థ‌ - మాట‌లు అందించిన సినిమా బ్రాండ్ బాబు.

త‌న ఫ్రెండు అయిన శైలేంద్ర‌బాబు త‌న‌యుడు సుమంత్ శైలేంద్ర‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ `బ్రాండ్ బాబు` అనే సినిమా తీశాన‌ని చెప్పాడు. అస‌లు ప‌రిశ్ర‌మ‌పై వీడిని రుద్దేస్తున్నాం అని కాకుండా వీడైతేనే స‌రిపోతాడు అనే రేంజులో అత‌డిని చూపిస్తున్నాడ‌ట‌.

ఇక బ్రాండ్‌ బాబు క‌థ గురించి మాట్లాడుతూ.. అస‌లు ఈరోజుల్లో బ్రాండ్‌ కి ఉన్న ప్ర‌యారిటీ హ్యూమ‌న్ ఎమోష‌న్స్‌ కి లేదు. యూత్‌ లో కుర్రాళ్లు - అమ్మాయిలు కేవ‌లం బ్రాండ్ కోస‌మే బ‌తికేస్తున్నారు. బ‌య‌ట ఎక్క‌డికి వెళ్లినా - ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ముందు బ్రాండ్ ఏంటో చూస్తున్నారు. తాము ఉప‌యోగించే బ్రాండ్‌ ని అంద‌రి ముందు ఉబ‌లాటంగా చూపించేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే చావులోనూ బ్రాండ్ చూస్తున్నారు. పెద్దింట్లో చావుమేళం ఉంటే - పెద్ద పెద్ద వాళ్ల‌ను పిలుచుకున్నాం కాబ‌ట్టి ఏడ‌వ‌కూడ‌దు. నాలుగు గోడ‌ల మ‌ధ్య ఏడ్చింది చాలు.. అంద‌రిముందే ఏంటిలా? అని త‌మ‌లో తామే ఏడుపును ఆపేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌ లో అలాంటివాళ్ల‌ను చూశాను. అలానే అప్ప‌ట్లో అమెరికా వెళ్లినప్పుడు అక్క‌డ బ్రాండ్‌ కి ఇచ్చే ప్ర‌యారిటీని చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. మ‌నం ఏదో సాధాసీదాగా బ‌తికేస్తున్నాం. ల‌క్ష‌లు పోసి చెప్పులు - ఖ‌రీదైన దుస్తులు కొంటేనే సంతృప్తిప‌డే వాళ్లున్నారు. నా సినిమా ఆద్యంతం బ్రాండ్‌ తో రుద్దేస్తాను.. అని చెప్పాడు. ఈ సినిమా బ్లాక్‌ బ‌స్ట‌ర్ అన్న చందంగా మారుతి ఎక్స్ ప్రెష‌న్స్ క‌నిపించాయి. అదీ సంగ‌తి.
Tags:    

Similar News