‘మహానుభావుడు’ సినిమాతో మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు యువ దర్శకుడు మారుతి. దీని తర్వాత అతను అక్కినేని వారి కొత్త పెళ్లికొడుకు నాగచైతన్యతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి మీడియాతో కొన్ని ముచ్చట్లు పంచుకున్నాడు మారుతి. పెళ్లి తర్వాత వచ్చే ఇగోల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందంటూ వస్తున్న వార్తల్ని మారుతి ఖండించాడు. అక్కినేని హీరోలంటే ప్రేమకథలకు పెట్టింది పేరని.. చైతూ కూడా ఇప్పటిదాకా మంచి ప్రేమకథలు చేశాడని.. తాను చైతూతో చేసేది కూడా ప్యూర్ లవ్ స్టోరీ అని మారుతి వెల్లడించాడు. ఈ చిత్రంలో కథానాయికగా అను ఇమ్మాన్యుయెల్ నటిస్తుందని కూడా మారుతి తెలిపాడు.
ఇక తాను స్క్రిప్టు రాసే శైలి గురించి మారుతి చెబుతూ.. తాను హీరోల్ని దృష్టిలో ఉంచుకుని కథలు రాస్తానని అన్నాడు. హీరో ఫిక్సయ్యాకే తాను కథ రాస్తానని.. హీరో ఇమేజ్.. బాడీ లాంగ్వేజ్.. స్టైల్ దృష్టిలో ఉంచుకుని పాత్రను తీర్చిదిద్దుతానని అతను చెప్పాడు. తాను ఏ కథ రాసినా తన సన్నిహితులు చాలామందితో దాన్ని పంచుకుంటానని.. అందరి అభిప్రాయాలూ తీసుకుంటానని.. అందరి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తేనే ముందుకు వెళ్తానని మారుతి తెలిపాడు. మున్ముందు టాలీవుడ్ పెద్ద హీరోలందరితోనూ కలిసి పని చేయాలని.. పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తున్నానని మారుతి చెప్పాడు. తన సినిమాలో ఒక సీన్ చూసినా.. అది తన సినిమా అని చెప్పేలా తనకంటూ ఒక ముద్ర ఉండేలా చూసుకుంటానని.. మున్ముందు వేర్వేరు జానర్లలో సినిమాలు చేయాలని ఆశిస్తున్నానని మారుతి తెలిపాడు.