మెగా ఫ్యామిలీతో మారుతికున్న అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్‌కి అత్యంత సన్నిహితుడు మారుతి. తొలినాళ్లల్లో గీతా ఆర్ట్స్ నుంచి రూపొందిన సినిమాలకి పబ్లిసిటీ సైడ్ పనిచేశాడు మారుతి. బన్నీ ఇచ్చిన ప్రోత్సాహంతో `ఈరోజుల్లో` అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఆడియో వేడుకకి కూడా బన్నీ, అల్లు అరవింద్ హాజరై హైప్ తీసుకొచ్చారు. `ఈరోజుల్లో` ఘన విజయం సాధించడంతో ఇండస్ట్రీలో మారుతి పేరు మార్మోగిపోవడం మొదలైంది. ఆ తర్వాత `బస్ స్టాప్`, `ప్రేమకథా చిత్రమ్`లతో వరుసగా హిట్టు కొట్టాడు. మూడు వరుస విజయాల తర్వాత చేసిన `కొత్తజంట` మాత్రం అనుకొన్నంత సంతృప్తినివ్వలేదు. తన హోమ్ బ్యానర్ లాంటి గీతాఆర్ట్స్ లో చేసిన ఆ సినిమా సక్సెస్ కాకపోవడం మారుతికి రుచించలేదట. ఎలాగైనా ఆ సంస్థలో ఓ భారీ హిట్టు కొట్టాల్సిందే అని కంకణం కట్టుకొని `భలే భలే మగాడివోయ్` తీశాడట. ఆ విషయం గురించి నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో మాట్లాడాడు మారుతి.
ఎలాగైనా హిట్టు కొట్టే గీతాఆర్ట్స్ ఆఫీసులోకి అడుగు పెట్టాలనుకొన్నానని చెప్పుకొచ్చాడు మారుతి. `భలే భలే మగాడివోయ్` ఊహించనంత స్థాయిలో ఘన విజయం సాధించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, దర్శకుడిగా ప్రత్యేకమైన గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టిందని స్పష్టం చేశాడు మారుతి. `భలే భలే మగాడివోయ్` ఇచ్చిన స్ఫూర్తితో ఇక నుంచి ఇలాంటి మంచి సినిమాలే చేస్తానని మారుతి మాటిచ్చాడు. తొలిరోజుల్లో ఆయనపై బూతు ముద్ర ఉండేది. యూత్‌ని ఆకట్టుకోవడానికే అన్నట్టుగా పాత్రలతో ఏ సర్టిఫికెట్ జోకులు వేయించేవాడు. దీంతో ఆయన సినిమాలకి ఫ్యామిలీ ఆడియెన్స్ వెళ్లడానికి భయపడేవాళ్లు. కానీ `భలే భలే మగాడివోయ్` క్లీన్ సినిమాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. అందుకే మారుతి ఈ సినిమా నాకు గౌరవాన్ని తెచ్చిపెట్టిందంటున్నాడు. మంచి సినిమాలు తీస్తే మంచి ఫలితమే వస్తుందన్న విషయం మారుతికి తెలిసింది కాబట్టి ఇక నుంచి మంచి సినిమాలే తీస్తాడనడంలో సందేహం లేదు.