మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఖైదీనంబర్ 150 - సైరా నరసింహారెడ్డి లాంటి భారీ చిత్రాల్లో నటించి బాస్ ఈజ్ బ్యాక్ అని నిరూపించారు. ఇప్పుడు `ఆచార్య` చిత్రంలోనూ ఆయన పాత్ర ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. తదుపరి నలుగురు దర్శకులను ఫైనల్ చేసి వెంట వెంటనే సినిమాల్ని ప్రారంభించారు. ఆ నలుగురు సీనియర్ దర్శకులు కాగా... మరో నలుగురు యువదర్శకుల స్క్రిప్టుల్ని కూడా చిరు వింటున్నారని కథనాలొచ్చాయి. ఇందులో మారుతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇటీవలే దర్శకుడు మారుతి మెగాస్టార్ ని కలిసి ఓ లైన్ ని వినిపించారని కథనాలొచ్చాయి. ఆ సమయంలో చిరుతో కలిసి ఉన్న ఫోటోని మారుతి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది. అయితే మెగాబాస్ కి వినిపించిన లైన్ ఎలాంటిది? అన్నది మారుతి రివీల్ చేయలేదు. బాస్ నుంచి పాజిటివ్ సంకేతాలు అందాయి. బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారని మీడియా కథనాలొచ్చాయి.
తాజా సమాచారం మేరకు.. మెగా బాస్ కోసం మారుతి ఎంపిక చేసుకున్న కథాంశం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని తెలిసింది. ఇది శంకర్ దాదా ఎంబీబీఎస్ తరహాలో ఫన్ ఎలిమెంట్స్ ఎమోషన్ తో సాగే స్క్రిప్ట్. ఒకరకంగా శంకర్ దాదా 3 తరహాలో ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రానికి జయంత్.సి ఫరాన్జీ దర్శకత్వం వహించగా... శంకర్ దాదా జిందాబాద్ కి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఇవి రెండూ సంజయ్ దత్ నటించిన మున్నాభాయ్ సిరీస్ కి రీమేక్ లు. ఇప్పుడు అదే తరహా లైన్ విభిన్న నేపథ్యంతో మారుతి మరో చిత్రాన్ని తెరకెక్కిస్తారన్నది ఆసక్తిని పెంచుతోంది. ఇందులో ఫన్ తో పాటు చక్కని సందేశాన్ని ఇన్ బిల్ట్ చేస్తున్నారన్న గుసగుసా వేడెక్కిస్తోంది.
మెగాస్టార్ దూకుడు ముందు ఏదీ నిలవదు
మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆచార్య చిత్రీకరణ పూర్తయింది. సంక్రాంతికి ఈ చిత్రం రిలీజవుతోంది. తదుపరి మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ `గాడ్ ఫాదర్` తెరకెక్కుతోంది. దీంతో పాటు మెగాస్టార్ మరో రెండు చిత్రాల్లో నటిస్తారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న వేదాళం రీమేక్ టైటిల్ గా `భోళా శంకర్`ని ప్రకటించారు. భోళా శంకర్ టైటిల్ కి తగ్గట్టే మెగాస్టార్ నుంచి గొప్ప వినోదాన్ని అందించనున్నారు.అలాగే మెహర్ కంటే ముందే బాబీతో సినిమా చిత్రీకరణకు వెళ్లాల్సి ఉంటుందిట. కానీ దర్శకుడు బాబి తెరకెక్కించే సినిమాకి టైటిల్ ని అధికారికంగా ప్రకటించలేదు. మెగా బాస్ ని పూర్తి మాస్ రోల్ లో చూపించేందుకు బాబి సిద్ధమవుతున్నారు. చిరు బర్త్ డే రోజున పోస్టర్ ని లాంచ్ చేయగా చక్కని స్పందన వచ్చింది. దీనికి వాల్తేరు వీరన్న లేదా వాల్తేరు శీను అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని కథనాలొచ్చాయి. వైజాగ్ లోని మత్స్యకారుల నేపథ్యంలో మాస్ స్టోరీని బాబి ఎంపిక చేసుకున్నారని ఊహాగానాలు సాగిస్తున్నారు. వాల్తేర్ కి చెందిన వీరన్న కథను బాబి రాసారు. అయితే ఇప్పుడు వీరన్న టైటిల్ మారుతుందని ఊహాగానాలు సాగుతున్నాయి. వాల్తేర్ వీరన్న కాస్తా వాల్తేర్ శీనుగా మార్చారని కథనొలొచ్చాయి. గాడ్ ఫాదర్ చిత్రీకరణ పూర్తి కాగానే బాబీతో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మాస్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తుంది. వరుసగా మూడు సినిమాలు పూర్తయ్యాక మారుతికి ఛాన్సుంటుందని భావిస్తున్నారు.