కలెక్షన్లలో గ్లోబల్ నెంబర్ వన్ గా 'మాస్టర్'

Update: 2021-01-19 04:39 GMT
కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన  తాజా చిత్రం 'మాస్టర్'. సంక్రాంతి సందర్భంగా ఈనెల 13 వ తేదీన విడుదలైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ లభించింది. అయితే సినిమాకు వచ్చిన రివ్యూలకు, కలెక్షన్లకు పొంతన ఉండటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు వెయ్యి థియేటర్లలో మాస్టర్ సినిమా విడుదలైంది.

అయితే ప్రస్తుతం థియేటర్లోకి  50 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్ సినిమాకు కలెక్షన్లు తగ్గుతాయని అంతా భావించారు. అయితే సుమారుగా పది నెలలుగా సరైన సినిమా లేకపోవడం, అందులోనూ అగ్రహీరో సినిమా విడుదల కాకపోవడంతో తమిళ ప్రేక్షకులు హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా థియేటర్లలోకి క్యూ కడుతున్నారని సమాచారం. దీంతో మాస్టర్ సినిమా విడుదలైన వారం రోజులైనా కలెక్షన్లు తగ్గడం లేదు. దీంతో విజయ వరుసగా ఆరోసారి 100 కోట్ల క్లబ్ లో చేరాడు.తెలుగునాట కూడా ఈ సినిమా 10 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఇదిలా ఉండగా మాస్టర్ సినిమా ఈ వీకెండ్లో ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచి రికార్డు సాధించినట్లు ఆ చిత్ర యూనిట్ ప్రకటించింది. తమిళనాట మాస్టర్ కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అంచనాలకు మించి  వసూళ్లు  చేస్తుండటంతో ట్రేడ్ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లో క్రాక్  వంటి హిట్ సినిమా ఉన్నా,50 శాతం ఆక్యుపెన్సీ తో కూడా  మాస్టర్  సినిమా రికార్డులు బద్దలుకొడుతుండటంతో ఇళయదళపతి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Tags:    

Similar News