ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం మాస్టర్. మాళవికా మోహనన్ కథానాయిక. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటించారు. ఖైదీ ఫేం లోకేష్ కనగ్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పవర్ ప్యాక్డ్ ఎమోషనల్ మాస్ స్పోర్ట్ ఫిలిం తమిళంలో ఆకట్టుకున్నా తెలుగులో ఆశించిన విజయం సాధించని సంగతి తెలిసినదే.
అయితే థియేట్రికల్ రన్ నెల అయినా అవ్వకుండానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంత పెద్ద సినిమా స్ట్రీమింగ్ కు రావడం పంపిణీ ఎగ్జిబిషన్ వర్గాల్లో చర్చకు వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి డిలీటెడ్ సీన్స్ ను ప్రైమ్ వీడియో వాళ్లు తాజాగా విడుదల చెయ్యగా మన ఆర్టిస్టుల్లోనూ చర్చకు వచ్చింది.
ముఖ్యంగా లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్థావిస్తూ.. దళపతి విజయ్ రిఫరెన్స్ సీన్.. కాలేజ్ స్టూడెంట్స్ ఎపిసోడ్ కు మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఇంతటి ఇంపార్టెంట్ సీన్ తీసేశారేమిటి మాస్టారూ? అని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి ఇందులో తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖావాణి అద్భుత ఎమోషన్ తో నటించారు. ఈ సీన్ పడి ఉంటే తన పేరు మార్మోగేదే. కానీ నిడివి వల్ల తొలగించాల్సి వచ్చింది. ఏదేమైనా డిలీటెడ్ సీన్ మాత్రం సోషల్ మీడియాలో అదరగొడుతుంది. ఒకవేళ ఆ సీన్ యాడై ఉంటే 3గంటలు పైగా ఉండేది సినిమా. ఇక చాలా మంది ఆర్టిస్టులు తాము నటించిన ఇంపార్టెంట్ సీన్ తొలగించేస్తే చాలా హర్టవుతుంటారు. మరి అమెజాన్ వాళ్లు రిలీజ్ చేసిన ఈ సీన్ చూశాక సురేఖ కూడా ఎమోషన్ కి గురై ఉంటారేమో!!
Full View