తమిళ సూపర్ స్టార్ విజయ్ ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తూ వందల కోట్లను వసూళ్లు చేస్తూ దూసుకు పోతున్న సమయంలో కరోనా ఆయన స్పీడ్ కు బ్రేక్ వేసింది. మాస్టర్ సినిమాను ఈ ఏడాది సమ్మర్ లో విడుదల చేసి మరో సినిమాను ఇదే ఏడాది చివర్లో విడుదల చేయాలనుకున్న విజయ్ ప్లాన్ బెడిసి కొట్టింది. విడుదలకు సిద్దం అయిన మాస్టర్ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయాలనుకుంటే అది వచ్చ ఏడాది సమ్మర్ వరకు ఆగే పరిస్థితి కనిపిస్తుంది. విజయ్ సినిమా అంటే మాస్ క్లాస్ ఆడియన్స్ అంతా వచ్చి చూసేలా ఉంటుంది. అలాంటి సినిమాను మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న సమయంలో విడుదల చేయడం అంటే రిస్క్ తీసుకోవడమే అని నిర్మాతలు భావిస్తున్నారట.
థియేటర్లో ఓపెన్ అయినా కూడా వెంటనే జనాలు థియేటర్లకు రారు. కరోనా భయం నూటికి నూరు శాతం పోయిన తర్వాత థియేటర్లకు మునుపటి మాదిరిగా ప్రేక్షకులు బారులు తీస్తారు. అప్పుడు విడుదల చేస్తేనే మినిమం 250 కోట్ల వసూళ్లు వస్తాయని 'మాస్టర్' మేకర్స్ భావిస్తున్నారట. అందుకే వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమాను విడుదల నిలిపేయాలని నిర్ణయించుకున్నారు. తమిళ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మాస్టర్ సినిమాను పరిస్థితులు పూర్తిగా కుదుట పడ్డ తర్వాతే విడుదల చేయాలనుకుంటున్నారట. పలువురు స్టార్ హీరోలు కూడా ఇదే నిర్ణయంతో ఉన్నారని తెలుస్తోంది. అంటే విజయ్ సినిమా రావడానికి మరో ఆరు నెలల సమయం అయిన పట్టనుంది. ఇది విజయ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.