అనుకున్నదే అయింది. మంచి సినిమా కంటే బూతు చిత్రం మీద హిందీ ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి ఉందని అర్థమైంది. ఇది ఏ ఇండస్ట్రీలో అయినా ఉండేదే కానీ.. హిందీలో బూతు సినిమాల మీద ఆసక్తి మరీ ఎక్కువని మరోసారి రుజువైంది. పోయిన శుక్రవారం బాలీవుడ్లో మాధవన్ ప్రధాన పాత్ర పోషించిన ‘సాలా ఖడూస్’తో పాటు సన్నీ లియోన్ ద్విపాత్రాభినయం చేసిన ‘మస్తీ జాదే’ రిలీజైన సంగతి తెలిసిందే.
ఈ రెండింట్లో సన్నీ సినిమాకే అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా జరిగాయి. ఓపెనింగ్స్ విషయంలోనూ ‘మస్తీ జాదే’నే పైచేయి సాధించింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.6.5 కోట్ల ఓపెనింగ్స్ తెచ్చుకోవడం విశేషం. ఈ సినిమాకు మంచి రివ్యూలేమీ రాలేదు. చెత్త సినిమా అని.. అడల్ట్ డోస్ మరీ ఎక్కువైందని అన్నారు సమీక్షకులు.
ఐతే మాధవన్ సినిమా ‘సాలా ఖడూస్’కు చాలా మంచి రివ్యూలొచ్చాయి. మంచి టాక్ వినిపించింది. అయినప్పటికీ ఈ చిత్రం తొలి రోజు రూ.2.5 కోట్లే వసూలు చేసింది. అది కూడా తమిళ వెర్షన్ కూడా కలిపితే వచ్చిన మొత్తం. ఐతే కలెక్షన్లు స్టడీగా ఉన్న మాట మాత్రం వాస్తవం. వీకెండ్ అయ్యాక కూడా జనాలు ఈ చిత్రాన్ని బాగానే ఆదరిస్తున్నారు. ఈ ఏడాది ‘ఎయిర్’ లిఫ్ట్’ తర్వాత ఇదే మంచి సినిమా అన్న పేరొచ్చింది. ఐతే ప్రశంసల మాటేమో కానీ.. కలెక్షన్ల విషయంలో మాత్రం ‘మస్తీ జాదే’ మంచి సినిమా మీద పైచేయి సాధిస్తోంది.