భారతీయ సినిమా గర్వించదగ్గ భారీ సినిమా అంటూ 'బాహుబలి'ని ఆకాశానికెత్తేసింది మీడియా. రామోజీ ఈనాడు మీడియా సంస్థలు అయితే బాహుబలికి ఇచ్చిన సపోర్టు అమోఘం. అవసరమైన ప్రచారం కంటే హైప్ క్రియేట్ చేసి ఆకాశానికెత్తేసింది. ఫలితం రెట్టించిన అంచనాల నడుమ బాహుబలి మిశ్రమ స్పందనల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇక అదంతా ముగిసిన గతం.
ఇప్పుడు తెలుగు మీడియా దృష్టి సారించాల్సిన వేరొక సినిమా ఉంది. తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన కాకతీయ వీరనారి రుద్రమదేవి చరిత్రను సినిమాగా తెరకెక్కించాడు గుణశేఖరుడు. అతడు చరిత్రను ప్రేమించి, ఈ సినిమా కోసం దాదాపు 80కోట్ల పెట్టుబడులు పెట్టాడు. గొప్ప ప్యాషన్‌తో ఈ సినిమాని తెరకెక్కించాడన్నది వాస్తవం. ఇది జాతిని మేల్కొలిపే సినిమా. తెలుగువారి కీర్తి పతాకను ప్రపంచ సినీయవనికపై రెపరెపలాడించే సినిమా. అందుకే ఈ సినిమాకి కూడా మీడియా సపోర్టు చాలా అవసరం. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఉంది.
ఇప్పటికే బాహుబలి ముందు ఏదీ నిలవదు.. అని ప్రచారం కావడంతో ఇతర సినిమాలు రిలీజ్‌కు రాకుండా ఆగిపోయాయ్. మరి రుద్రమదేవికి కూడా అదే రేంజ్ పబ్లిసిటీ ఇస్తారా? ఓ సిన్సియర్ ఎటెంప్ట్‌ని అంతే సిన్సియర్‌గా ప్రోత్సహించడం అందరి బాధ్యత. ఆగస్టులో రిలీజ్‌కి వస్తున్న ఈ సినిమాకి ఎవరు ఎలాంటి సాయం చేస్తారో వేచి చూడాల్సిందే.