చెన్నయ్ అల్లకల్లోలం అయ్యింది. జనావాసాలు విధ్వంసం అయ్యాయి. తిండి లేదు - తాగు నీరు లేదు. ఎటూ పోవడానికి లేనేలేదు. ఈ విలయంలో మనుషులెందరో విగత జీవులయ్యారు. ఎన్నో మూగ ప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. అక్కడ చేరిన నీటిలో ఈ మృతదేహాలన్నీ కలిసిపోయి ప్రమాదకర వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. వరదల వేల జెట్ స్పీడ్ తో అంటు రోగాలు ప్రబలిపోతాయి. ఏమాత్రం జాగ్రత్త తీసుకోకపోయినా అంతే సంగతి.
అంతేకాదు చెన్నయ్ ఇప్పుడున్న పరిస్థితిలో మెడిసిన్ శరవేగంగా అందించాల్సి ఉంటుంది. అలసత్వం చూపిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పరిస్థితి చాలా సీరియస్ గా ఉందక్కడ. అయితే ఇలాంటి సన్నివేశంలో మన హీరోలంతా ఎంతో డేర్ చేసి చెన్నయ్ వాసుల్లో భయాన్ని తొలగిస్తున్నారు. ట్రక్కుల కొద్దీ, టన్నుల కొద్దీ మెడిసిన్ ని వారికి అంద జేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం చెన్నయ్ వీధుల్లో నాలుగు టీమ్ లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. సరిహద్దులు దాటి చెన్నయ్ నగరంలోకి ట్రక్కులతో మెడిసిన్ తెప్పిస్తున్నారు. ప్రజలకు నేరుగా వాటిని అందేలా చేస్తున్నారు. రానా అండ్ టీమ్ - సిద్ధార్థ్ అండ్ టీమ్ - ధనుష్ అండ్ టీమ్ - విశాల్ అండ్ టీమ్ .. ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి.
సిద్ధార్థ్ తో పాటు ఆర్.జె. బాలాజీ - ధనుష్ తో పాటు ఐశ్వర్య - విశాల్ తో పాటు కార్తీ - ఆర్య ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవలే రామానాయుడు స్టూడియో నుంచి ఓ ట్రక్కు మెడిసిన్ చెన్నయ్ వెళ్లింది. వాటిని కేవలం కొన్ని నిమిషాల్లోనే చెన్నయ్ వాసులకు పంచేశారు. అక్కడికి ఎన్ని ట్రక్కులతో మెడిసిన్ తెచ్చినా చాలని పరిస్థితి. అందుకే ఇప్పటికీ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సెలబ్రిటీల టీమ్ లు తమ వంతు సాయంగా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయ్. ప్రయత్నం బావుంది. ప్రజలంతా స్పందించి మరింతగా మెడిసిన్ కొని చెన్నయ్ కి సప్లయ్ చేస్తే తప్పేం కాదు.