మెగా కుటుంబంతో మంచు కుటుంబం స్నేహ సంబంధాల గురించి ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు గిల్లికజ్జాలు బయటపడినా స్నేహాన్ని కొనసాగించేందుకు ఇరు కుటుంబాలు ఎప్పుడూ వెనకాడవన్న టాక్ ఉంటుంది. చిరంజీవి- మోహన్ బాబు కలిసి ఒకే వేదికపై ఎంతో ఆప్యాయతల్ని కనబరుచుకోవడం సినీపెద్దలుగా కలిసి పని చేయడం ఇదంతా తెలిసిన వ్యవహారమే.
దీపావళి.. సంక్రాంతి వంటి పండగలకు ఇరు కుటుంబాలు కలుసుకున్న సందర్భాలున్నాయి. రెండు కుటుంబాలు కలిసి చాలా పండుగలను జరుపుకుంటాయి.
తండ్రులను మించి వారసుల నడుమ స్నేహ సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయి. మంచు విష్ణు.. మనోజ్ ఇద్దరికీ రామ్ చరణ్ ఎంతో సన్నిహితుడు. చిరు కుమార్తెలు మంచు లక్ష్మీతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఇదిగో అందుకు సింబాలిక్ గా ఇక్కడ మంచు డాటర్ తో మెగా డాటర్ బాండింగ్ ప్రత్యక్ష ఉదాహరణ. తాజాగా శ్రీజా కళ్యాణ్ మంచు లక్ష్మి ఇద్దరూ ఒకరితో ఒకరు అక్కజెల్లెళ్లుగా కలిసిపోయి సంతోషంగా ఉన్న ఫోటోని షేర్ చేశారు. పార్టీలో ఎంజాయ్ చేశాక ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తారు.
``అక్కలూ..! మీతో ఎప్పుడూ నీరసంగా ఉండదు`` అని శ్రీజ తన అధికారిక ఇన్ స్టాలో ఆ ఫోటోని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో మెగా మంచు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది.