మెగా డాటర్ శ్రీజ-కళ్యాణ్ దేవ్ లు దూరంగా ఉంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టు కొన్ని సంకేతాలు గతంలో కనిపించాయి. సోషల్ మీడియాలో కళ్యాణ్ దేవ్ అకౌంట్లను అన్ ఫాలో చేయడం.. తల్లిదండ్రులతో ఉన్న ఫోటోలు..అప్పుడప్పుడు బిడ్డతో పాటు దిగిన సెల్పీలు పోస్ట్ చేయడం...వాటిలో ఎక్కడా కళ్యాణ్ దేవ్ కనిపిచంక పోవడం వంటి సంకేతాలు మీడియా కథనాలకు మరింత ఆజ్యం పోసాయి.
అలాగే ఆమధ్య శ్రీజ ముంబైకి వెళ్లినప్పుడు వెంట సోదరుడు రామ్ చరణ్ ఉండటం వంటివి మీడియాలో ఆసక్తికరంగా మారాయి. ఈ ప్రచారాన్ని శ్రీజ గానీ..కళ్యాణ్ దేవ్ గానీ ఇంతవరకూ ఖండించలేదు. వాళ్లిద్దరి తరుపున ఏఒక్కరూ మీడియా ముందు వివరణ ఇచ్చింది లేదు. ఈ నేపథ్యంలో కథనాలు వైరల్ గా మారాయి.
తాజాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీజ ఆసక్తికర పోస్ట్ లు పెట్టారు. 2023 లోకొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. అలాగే గతాన్ని గుర్తు చేసుకుని అంతే ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
'ప్రియమైన 2022.. నా జీవితంలో అత్యంత ముఖ్యమైనది. నాకు నేను ఏంటో అర్ధమైంది. ఒక వ్యక్తిగా నన్ను నేను ఎంతో అర్ధం చేసుకున్నాను. నాపై నాకు మరింత శ్రద్ద పెరిగింది.
నాలో తప్పొప్పులను గ్రహించాను. మునుపెన్నడు లేని సరికొత్త మార్పుకు నాంది పలికాను. నా తోపాటు ప్రయాణం చేసిన ప్రియమైన వారందర్నీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది.
నా ఎదుగుదల పతనాల్లోనూ అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. నన్ను ఇలా అనుమతించినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం చాలా అద్భుతంగా ఉంది. ఇక నా ప్రయాణం ప్రారంభమవుతుంది. ప్రేమ.. కరుణ.. ఆనందం .. జ్ఞానంతో 2023లోకి అడుగుపెడుతున్నాను' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.