ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న ఒక క్రేజీ న్యూస్ ఏంటంటే.. ''చరణ్ పట్ల అప్ సెట్ అయిన మెగా ఫ్యాన్స్'' అనే ఐటెం. నిజానికి ఈ మెగా ఫ్యాన్స్ ఎందుకు ఫీలయ్యారంటే.. ''తని ఒరువన్'' సినిమాలో మినిమం చేంజ్ కూడా లేకుండా ఒరిజినల్ తమిళ స్ర్కిప్టుతో చరణ్ షూటింగ్ చేద్దామని చెప్పడంతో.. స్టయిలిష్ విలన్ తో కూడిన ఆ కథ కారణంగా తమ హీరో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని వారు ఫీలయ్యారంటూ వార్తలొస్తున్నాయి. ఒకవేళ మెగా ఫ్యాన్స్ నిజంగా ఫీలైనా అవ్వకపోయినా కూడా.. అసలు ఈ సినిమాను చూడకుండా సినిమా అంతా విలన్ దే అనుకోవడం కాస్త విడ్డూరంగా ఉంది.
తని ఒరువన్ సినిమాలో.. మొదటి హాఫ్ మొత్తం విలన్ పాత్రను పోషించిన అరవింద్ స్వామి అస్సలు కనిపించడు. ఆర్జనైజ్డ్ క్రైమ్ మీద మన పోలీస్ హీరో దండయాత్ర చేస్తుంటాడు. కొన్ని మర్డర్లను ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఈ విలన్ గారు కనిపిస్తారు. అక్కడి నుండి సెకండాప్ విలన్ అండ్ హీరో స్టోరీ నడుస్తుంటుంది. ఏది.. మన రేసుగుర్రం సినిమాలో బన్నీ అండ్ శివా రెడ్డి కథ టైపులో అనమాట. పక్కా కమర్షియల్ కథే ఇది. మధ్యలో నయనతారతో రొమన్స్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే లేనిదల్లా.. ఒక స్పెషల్ కామెడీ ఎపిసోడ్ అంతే. పంచ్ డైలాగ్ ల నుండి థ్రిల్లింగ్ ట్విస్టుల వరకు చాలా ఉన్నాయి. మరి మెగా ఫ్యాన్స్ దేనికి ఫీలవుతున్నారు సామీ?
ఇదే విషయం మెగా ఫ్యాన్స్ ను అడిగితే.. అసలు తని ఒరువన్ సినిమా మొదలవ్వట్లేదని మేం ఫీలవుతున్నాం కాని.. ఆ కథ గురించి ఏమీ వర్రీ అవ్వట్లేదు అంటున్నారు. గది సంగతి.