ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి ఆజ్యం పోసారు అనే రీతిలో సోషల్ మీడియాలో నాని గ్యాంగ్ లీడర్ టైటిల్ గురించిన చర్చ ఎంతకీ తెగడం లేదు. ఇది వాడుకోవడం సహించలేమని ఒక్క రామ్ చరణ్ కు తప్ప ఇంకెవరికి ఆ పేరు ఒప్పుకోమని మెగా ఫ్యాన్స్ తెగేసి చెబుతున్నారు. వీళ్ళకేం హక్కుందని ఏమైనా చేసుకోండి అని కొట్టిపారేయడానికి లేదు. సోషల్ మీడియా పవర్ ను తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు.
ఈ ఒక్క మాధ్యమాన్ని ఉపయోగించుకుని పట్టుమని పది మందికి తెలియని వాళ్ళు కూడా సెలెబ్రిటీలుగా మారిన ఉదంతాలు ఉన్నాయి. ఒకరిని అన్ పాపులర్ చేయడానికి కూడా దీన్ని మించిన శక్తివంతమైన ఆయుధం లేదు. నానికి ఇది తెలియంది కాదు. బిగ్ బాస్ షో సీజన్ 2 చేస్తున్నప్పుడు దాని బారిన పడిన వాడే. స్వయంగా ఈ విషయాన్నీ తనే ప్రస్తావించాడు కూడా. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయింది. గ్యాంగ్ లీడర్ రూపంలో మరోసారి ఈ ట్రాప్ మొదలైంది
దీనికి సులభ పరిష్కారం టైటిల్ మార్చడమే అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు కాని నాని అభిమానులు ఏం మా హీరో పెట్టుకోకూడదా కష్టపడి స్వంత టాలెంట్ తో పైకొచ్చిన నానికి చిరు టైటిల్స్ వాడుకునే పూర్తి అర్హత ఉందని వాదిస్తున్నారు. ఇది హీరోల ఫాలోయర్స్ మధ్య రెగ్యులర్ గా జరిగేదే కాని గ్యాంగ్ లీడర్ రచ్చ మాత్రం కాస్త ఎక్కువ మోతాదులోనే కనిపిస్తోంది.
పాతికేళ్ళు దాటిన తర్వాత కూడా ఎవరూ గ్యాంగ్ లీడర్ టైటిల్ ని ఎందుకు వాడుకోలేదో అర్థం చేసుకోవాలని చిరు ఫ్యాన్స్ కోరుతున్నారు. దానికి ఉన్న పవర్ ను మ్యాచ్ చేయాలంటే నాని చేసే సాఫ్ట్ స్టోరీస్ కు సూటవ్వదని వాళ్ళ వర్షన్. ఏది ఎలా ఉన్నా నానినో మైత్రినో దీని గురించి క్లారిటీ ఇస్తే బెటర్. ఇప్పటిప్పుడు టైటిల్ మార్పు తప్ప ఇక దేనికీ మెగా ఫ్యాన్స్ రాజీ పడేలా లేరు కాని వాళ్ళను కూల్ చేసే విధంగా ఏం చేస్తే బాగుంటుందా అనే చర్చలు నాని టీం లో జరుగుతున్నాయని ఫ్రెష్ అప్ డేట్