ఫలితం ఎలా వున్న మన వంతు పని మనం సక్రమంగా చేయాలనుకుంటారు కొంత మంది హీరోలు. తమ ముందు వున్న పని గురించే కానీ జరిగిపోయిన దాని గురించి పెద్దగా పట్టించుకోరు. అలాంటి క్రేజీ హీరోల్లో ముందు వరుసలో వుంటారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. 'ట్రిపుల్ ఆర్' వంటి పాన్ ఇండియా మూవీతో చరణ్ స్టార్ గా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన 'ఆచార్య' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
దాదాను రెండేళ్ల విరామం తరువాత చిరు నుంచి సినిమా అనగానే ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని, అబిమానుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా ఫలితంపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చిరు కెరీర్ లోనే ఈ మూవీ అత్యంత డిజాస్టర్ గా నిలిచి బయ్యర్లకు భారీ షాకిచ్చింది.
ఇదిలా వుంటే ఈ మూవీ ఫలితాన్ని పెద్దగా పట్టించుకోని హీరో రామ్ చరణ్ తన తదుపరి సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్రేట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఓ భారీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని 1930వ దశకం నేపథ్యంలో సెమీ పీరియాడిక్ స్టోరీగా తెరకెక్కిస్తున్నట్టుగా వార్తలు గత కొంత కాలంగా వినిపిన్నాయి. ఇప్పటికే మూడు షెడ్యూల్ లు పూర్తి చేసుకున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ఇటీవలే వైజాగ్ లో మొదలైంది.
అక్కడ చరణ్ పాల్గొనగా కాలేజీ సన్నివేశాలతో పాటు రోడ్లపై చరణ్ పాల్గొనగా ఓ ప్రత్యేక గీతాన్ని షూట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ట్రాఫిక్ పోలీసుల ముందు చరణ్ డ్యాన్స్ చేస్తున్నాడు.
'ఖుషీ' చిత్రంలోని 'యే మేరా జహ యేమేరా ఆషియా' అంటూ సాగే పాటని ఈ పాట గుర్తు చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. అప్పట్లో బాబాయ్ .. ఇప్పుడు అబ్బాయ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కిరారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో చరణ్ భిన్న పార్శాలున్న రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు.
సమకాలీన రాజకీయాలపై శంకర్ సంధిస్తున్న సెటైరికల్ అస్థ్రంగా ఈ సినిమా రూపొందుతోందని ఇప్పటికే ప్రచారం మొదలైంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా తిరు, ఎడిటింగ్ శామీర్ మహమ్మద్, కథ కార్తీక్ సుబ్బరాజ్, మాటలు సాయి మాధవ్ బుర్ర.