స్పెషల్‌ స్టోరి: బిరుదుల్లోనే మెగా తారకమంత్రం

Update: 2015-03-19 04:30 GMT
బిరుదుల యందు మెగా బిరుదులు వేరయా విశ్వదాభిరామ వినుర వేమ అని పద్యం పాడుకోవాల్సిందే. టాలీవుడ్‌లో ఇప్పుడు అరడజను మెగా హీరోలు ఉన్నారు. ఈ కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరికి బిరుదులు కూడా ఉన్నాయి. చిరంజీవి మొదలుకుని నేటితరం హీరో సాయిధరమ్‌ వరకూ బిరుదాంకితులయ్యారు. ఈ చరిత్రను ఓ మారు పరిశీలిస్తే..

చిరంజీవి:

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఎదిగే క్రమంలో డేరింగ్‌ డ్యాషింగ్‌ డైనమిక్‌ హీరో అన్నారు. కాలక్రమంలో సుప్రీంహీరో (యముడికి మొగుడులోని లిరిక్‌) అనే పాటతో చిరు పాపులర్‌ అయ్యారు. అక్కణ్ణుంచి అతడిని సుప్రీంహీరోగా అభిమానులు ప్రేమించారు. 1988లో రిలీజైన మరణమృదంగం సినిమాతో మెగాస్టార్‌ అన్న పిలుపు మొదలైంది. ఆ తర్వాత కొదమసింహం చిత్రంలో ఏకంగా స్టార్‌ స్టార్‌ మెగాస్టార్‌ అన్న లిరిక్‌తో మరింతగా ఆ బిరుదికి పాపులారిటీ వచ్చింది. అదే టైమ్‌లో బాలీవుడ్‌ నటుడు రాజేష్‌ కన్నాకి సూపర్‌స్టార్‌ అన్న బిరుదు వచ్చింది. అది అతడితో మొదలై అన్ని పరిశ్రమల్లో అందరు హీరోలకు పాకింది. అదే కోవలో తెలుగులో మెగాస్టార్‌ అన్న పదం చిరంజీవితోనే మొదలై మిగతా పరిశ్రమలకి పాకింది. అక్కడా హీరోల్ని మెగాస్టార్‌ అని పిలుచుకున్నారు.

నాగబాబు:

చిరంజీవి తర్వాత నటుడిగా నాగబాబు రంగప్రవేశం చేశారు. ఆ క్రమంలోనే మెగా ఫ్యాన్స్‌కి మెగా హీరోలకు ఆయనే ఓ బ్రిడ్జిగా మారారు. మెగాబ్రదర్‌ అని అభిమానులు ముద్దుగా పిలుచుకున్నారు.

పవన్‌ కళ్యాణ్‌:

రెండో సినిమా నుంచే పవర్‌ స్టార్‌ అన్న బిరుదు వచ్చేసింది. గోకులంలో సీత రిలీజ్‌ తర్వాత మెగాభిమానులంతా పవర్‌స్టార్‌ అన్న బిరుదును శాశ్వతం చేసేశారు. ప్రస్తుతం పవనిజం అనేది వ్యాప్తి చెందింది. పవర్‌స్టార్‌ అన్న పదమే అభిమానులుకు ఓ తారకమంత్రం లాంటిది.

రామ్‌చరణ్‌:

మెగా పవర్‌ స్టార్‌ అన్నది బిరుదు. తండ్రి చిరంజీవి బిరుదు 'మెగాస్టార్‌' నుంచి మెగా అన్న పదాన్ని, బాబాయ్‌ పవన్‌ బిరుదు పవర్‌స్టార్‌ నుంచి పవర్‌ పదాన్ని కలిపేసి మెగా పవర్‌ అనేది పుట్టింది. బిరుదుకి తగ్గట్టే చరణ్‌ టాలీవుడ్‌లో రికార్డులెన్నో నెలకొల్పాడు. సంచలనాల హీరో అయ్యాడు.

అల్లు అర్జున్‌:

ఒకానొక సందర్భంలో అల్లు అర్జున్‌ని మెగాస్టార్‌ ఓ పిలుపు పిలిచారు. స్టయిలిష్‌ స్టార్‌ అన్నదే ఆ పిలుపు. ఆ తర్వాత మెగాభిమానులు దానినే బిరుదుగా మార్చేశారు. అందుకు తగ్గట్టే బన్నీ తన టైటిల్‌ని కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. స్టయిలిష్‌ స్టార్‌ అని నిరూపించుకున్నాడు ఇప్పటికే.

వరుణ్‌తేజ్‌: చిరంజీవి స్వయంగా 'మెగా ప్రిన్స్‌' అని పిలిచారు. అభిమానులు ఇప్పుడు దానినే పాపులర్‌ చేసేశారు. ముకుంద చిత్రంతో విజయం అందుకుని పూరి, క్రిష్‌లతో సినిమాలకు సిద్ధమవుతున్నాడు వరుణ్‌తేజ్‌.

సాయిధరమ్‌ తేజ్‌:

ఇటీవలే రంగంలోకి వచ్చిన ఈ మెగా హీరోకి అప్పుడే ఓ బిరుదు పాపులర్‌ అయిపోయింది. మెగా సుప్రీం స్టార్‌ అనేది ఆ టైటిల్‌. ఇటీవలే రేయ్‌ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో వైవియస్‌ స్వయంగా ఇలా పిలిచారు. వాస్తవానికి సాయిధరమ్‌లోని డ్యాన్సింగ్‌ స్టయిల్‌, యాక్టింగ్‌ స్టయిల్‌ చూస్తే ఈ టైటిల్‌ సరైనదే అనిపించక మానదు. మెగా కాంపౌండ్‌లో మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ హీరోగా మునుముందు పాపులర్‌ కానున్నాడని పిల్లా నువ్వు లేని జీవితం సినిమా చూశాక ఎవరైనా చెబుతారు.

-హ్యాప్రా

Tags:    

Similar News