మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను రూపొందించి సినిమాలు తీయడంలో వాటిని విజయవంతం చేయడంలో అపారమైన నైపుణ్యం చూపించే అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చూపు డిజిటల్ రంగం వైపు మళ్ళుతున్నట్టు టాక్. ఇప్పటికే ఈ ఫీల్డ్ లో విపరీతమైన పోటీ ఉంది. అమెజాన్ ప్రైమ్ ఒకపక్క అగ్ర స్థానం వైపు కన్నేసి కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లతో దూసుకుపోతూ ఉండగా స్లోగా ఉన్నా నెట్ ఫ్లిక్స్ దానికి ధీటైన పోటీ ఇస్తోంది.
ఇవి కాకుండా జీ5 దీని మీద సీరియస్ గా దృష్టి పెట్టింది. కేవలం ఈ కంటెంట్ డెవలప్మెంట్ కోసమే గచ్చిబౌలిలో మూడు అంతస్తుల భవనం తీసుకుని పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. త్వరలో ఇది ప్రారంభం కానుంది. ఏక్తా కపూర్ ఆధ్వర్యంలో నడిచే ఏఎల్టి బాలాజీ ముందు నుంచే యాక్టివ్ గా ఉన్న హాట్ స్టార్ ఇలా ఎవరికి వారు క్వాలిటీ మీద ఫోకస్ పెట్టి పోటీని రసవత్తంరంగా మారుస్తున్నారు
అందుకే అల్లు అరవింద్ సైతం దీని మీద పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు మై హోం అధినేత జూపల్లి రామేశ్వర్ రావుల భాగస్వామ్యంలో సుమారు 150 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక వేస్తున్నట్టు సమాచారం. ఇది అధికారికంగా వచ్చిన సమాచారం కాకపోయినా బ్యాక్ గ్రౌండ్ వర్క్ మాత్రం జోరుగా సాగుతున్నట్టు వినికిడి.
ప్రేక్షకులు రిస్క్ చేయకుండా ఇంట్లోనే కూర్చుకుని మంచి వినోదాన్ని అందిస్తున్న డిజిటల్ యాప్స్ వైపు అధిక స్థాయిలో మొగ్గు చూపుతున్నారు. గీత ఆర్ట్స్ ఇంత పోటీలో ఎలా నెగ్గుకువస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదే జరిగితే నిర్మాతలకు ఆప్షన్ పెరిగి ఆదాయ మార్గాలు ఇంకా పెరుగుతాయి.