బాగోలేదన్న ఆ గొంతును వినాలని ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు పరుగులెత్తే వారు..! హీరో లక్షణాలు లేవన్న ఆ మనిషిని, అందరికన్నా ముందుగా చూడాలని ఫ్యాన్స్ అర్ధరాత్రి నుంచే క్యూలైన్లో నిలబడేవారు..! ఆయనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఇంతింతై అన్నట్టుగా.. సింగిల్ గా ఎంట్రీ ఇచ్చిన అమితాబ్.. ఇండస్ట్రీ మొత్తానికి బిగ్ బాస్ అనిపించుకునే స్థాయికి ఎదిగారు.
అయితే.. ప్రయాణంలో స్టార్ అవుతారని ఎవ్వరూ ఊహించరు. కాలమే దాన్ని నిర్ణయిస్తుంది. కాలక్రమంలో బాలీవుడ్ కే బాస్ గా మారిన అమితాబ్ బచ్చన్.. తొలిసారిగా ఇండస్ట్రీ తలు తట్టింది ఇవాళే! అమితాబ్ బచ్చన్ మొదటి చిత్రం 'సాత్ హిందుస్తానీ'. ఆ చిత్రంలో నటించేందుకు ఆయన సైన్ చేసింది 1969 ఫిబ్రవరి 15వ తేదీనే. ఈ రోజుతో ఆయన 52 వసంతాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు.
ప్రస్తుతం.. 78 ఏళ్ల బాలీవుడ్ మెగాస్టార్..దర్శకుడు ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ రూపొందించిన 'సాత్ హిందుస్తానీ' ద్వారా సినీ జర్నీ స్టార్ట్ చేశారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి ఫిబ్రవరి 15, 1969 న సైన్ చేయగా.. తొమ్మిది నెలల తరువాత నవంబర్ 7 న రిలీజ్ అయ్యింది.
ఈ సందర్భంగా.. ఐదు దశాబ్దాలుగా అమితాబ్ ప్రస్థానాన్ని వర్ణిస్తూ.. బిగ్ బి ఫొటోలతో ఓ అభిమాని వీడియో రూపొందించారు. ఈ వీడియోను ట్విటర్ లో పోస్టు చేశారు బచ్చన్. "నేను ఈ రోజునే చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాను. ఫిబ్రవరి 15, 1969. యాభై రెండు సంవత్సరాలు గడిచిపోయాయి! అందరికీ కృతజ్ఞతలు." అని పేర్కొన్నారు అమితాబ్. ఇన్నేళ్లుగా అభిమానులు కురిపిస్తున్న ప్రేమ ధన్యవాదాలు తెలిపారు.