మెగాభిమాన సంఘం అధ్య‌క్షుడికి మెగాస్టార్ బంప‌రాఫ‌ర్

Update: 2021-07-11 07:30 GMT
మెగాస్టార్ చిరంజీవి కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమాన సంఘాలు ఉన్నాయి. దేశంలో తెలుగు రాష్ట్రాల్లో అభిమాన సంఘాల అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయి. చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ - ఐ బ్యాంక్ న‌డిపించేది అభిమానులే. ఇటీవ‌ల క‌రోనా క్రైసిస్ లో ఆక్సిజ‌న్ బ్యాంకుల‌ను న‌డిపిస్తోంది మెగా ఫ్యాన్సే.

అయితే అలాంటి అభిమాన సంఘంలో ప‌ని చేశాకే ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చారు ద‌ర్శ‌కుడు బాబి. అత‌డు ఒక మెగాభిమానిగా మెగా ఫ్యాన్స్ సంఘం మెంబ‌ర్ గా అధ్య‌క్షుడిగా ప‌ని చేశాక‌ ఇప్పుడు అత‌డు ఏకంగా చిరునే డైరెక్ట్ చేసే అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. ఒక అభిమానికి అరుదుగా ద‌క్కే అవ‌కాశం అని చెప్పాలి.

గుంటూరు నుంచి హైద‌రాబాద్ కి బాబి ఎలా వ‌చ్చాడు? అంటే.. చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాల‌న్నా చిరంజీవి అన్నా బాగా పిచ్చి. ఆయన సినిమా విడుదలైన మొదటి రోజే నాన్న కె. మోహనరావుతో క‌లిసి బెనిఫిట్‌ షో చూడాల్సిందేన‌ట‌. ఊహ తెలిసిన తర్వాత నేను చిరంజీవి గారి ఒక్క బెనిఫిట్‌ షో కూడా మిస్‌ కాలేదు.. అని బాబి తెలిపారు. తండ్రి నాట‌క ర‌చ‌యిత‌. కాలేజీలో తాను చిరంజీవి అభిమాన సంఘం అధ్య‌క్షుడు. చిరు కొత్త సినిమా రిలీజైతే బైక్ ర్యాలీలు క‌టౌట్లు క‌ట్ట‌డాలు వ‌గైరా హడావుడి చేసేవాడు.

ఇంద్ర సినిమా టైమ్ లో గుంటూరులో అభిమాన సంఘాల త‌ర‌పున ర‌చ‌యిత చిన్నికృష్ణ‌ను క‌లిసిన బాబి ఆ త‌ర్వాత హైదాబాద్ ర‌మ్మ‌న‌గానే ఇక్క‌డికి వ‌చ్చేశార‌ట‌. ఇంత వేగంగా వ‌స్తావ‌ని అనుకోలేదు అంటూ ఆయ‌న అవాయిడ్ చేస్తున్నా సినిమాల‌కు ప‌ని చేస్తాన‌ని వెంట‌పడ్డాడు. న‌టుడిగా వేషం అంటే వ‌ద్ద‌నుకుని ర‌చ‌యిత‌ను అవుతాన‌ని బాబి తెలిపారు. చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ తరపున పనిచేస్తున్నా కదా... గొడవెందుకు అనుకుని `గంగోత్రి` తీస్తున్న రాఘవేంద్రరావుగారి దగ్గరకు చిన్నికృష్ణ‌ పంపారు. కానీ నిక్క‌రులో న‌టిస్తే ప‌రువు పోతుంద‌ని తిరిగి చిన్నికృష్ణ వ‌ద్ద‌కే వెళ్లి ర‌చ‌యిత‌ను అవుతాన‌ని తెలిపారు. సినిమా క‌థ‌లు రాస్తాన‌ని అన్నారు బాబి. ఆయన కొద్ది కాలం ఎవాయిడ్ చేసి చివ‌రికి ``గంగోత్రి`లో ఒక సీన్ రాయ‌మ‌ని అడిగారు. ప్రకాష్ రాజ్‌- సుమన్‌ల సీన్ క‌ష్టంగా ఉన్నా మధ్యాహ్నానికే ఆయనకు సీన్‌ రాసి ఇచ్చార‌ట‌. ఆ త‌ర్వాత ర‌చ‌యిత‌ల టీమ్ లో చేరారు.

19 ఏజ్ లో  ర‌చ‌యిత‌గా ప్ర‌యాణం మొద‌లైంది. ద‌ర్శ‌కుడు ఆదినారాయణ వ‌ద్ద‌ పొలిటికల్‌ రౌడీ కి అసిస్టెంట్ డైరెక్ట‌ర్. తర్వాత కోన వెంకట్‌.. దిల్‌రాజు వ‌ద్ద ప‌ని చేశాడు. రవితేజకు బలుపు టైమ్ లో క‌థ చెప్పి `ప‌వ‌ర్` మూవీకి ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ద‌క్కించుకున్నారు.  ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరి కథ వారే రాసుకోవటం మంచిది. దర్శకుడే కథ రాసుకున్నప్పుడు తనకు కావాల్సిన విధంగా మ‌లుచుకునే అవ‌కాశం ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్ లో ఎక్కువ మంది నిర్మాతలు అలాంటివారిని ఎంచుకునేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ని బాబి తెలిపారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా బాబి ఓ చిత్రానికి స‌న్నాహ‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. మెగాభిమాన సంఘం నాయ‌కుడిగా మొద‌లై చివ‌రికి మెగాస్టార్ నే డైరెక్ట్ చేస్తున్నాడు.

చిరుతో సినిమా మొద‌ల‌య్యేది ఎప్పుడు? అంటే.. స్క్రిప్ట్‌ రెడీ.. పాట‌లు రెడీ అవుతున్నాయి. ఆచార్య త‌ర్వాత `లూసిఫర్` తెలుగు రీమేక్ పూర్తి కావాలి. ఈ సినిమాతో పాటు మా సినిమా మొదలవుతుందా? ఆ తర్వాత మొదలవుతుందా? అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బాబి తెలిపారు.
Tags:    

Similar News