ఖైది నెంబర్ 150తో కం బ్యాక్ ఇచ్చాక మెగాస్టార్ చిరంజీవి ఇకపై వరసగా ఏడాదికి ఒకటి చేస్తారని మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు. అయితే నెక్స్ట్ మూవీనే సైరా నరసింహారెడ్డి లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ టేకప్ చేయడంతో ఎదురు చూపులు రెండేళ్ళు దాటిపోయాయి. షూటింగ్ లో జరుగుతున్న ఆలస్యం భారీ తారాగణం కావడంతో కాల్ షీట్స్ లో వస్తున్న సమస్యలు వీటితో పాటు వయసు దృష్ట్యా చిరు తీసుకుంటున్న జాగ్రత్తలు అన్ని కలిపి సైరాను అనుకున్న సమయంలో పూర్తి కాకుండా అడ్డు పడ్డాయి.
ఆ మధ్య చరణ్ ఈ ఏడాది దసరాకే రిలీజ్ చేస్తామని చెప్పాడు కాని గ్రౌండ్ లెవెల్ పరిస్థితి చూస్తే అది అసాధ్యమని మెగా కాంపౌండ్ వర్గాలే అంటున్నాయి. ఇంకొంత సమయం అవసరం పడుతుందని 2020 సంక్రాంతికి ప్లాన్ చేసుకోవడం బెస్ట్ అని చెబుతున్నారు. అది తర్వాత తేలే విషయం కాని ఇప్పుడు బాలన్స్ ఉన్న సైరా పూర్తి కావడానికే జూన్ వస్తుందని సమాచారం
ఇదిలా ఉండగా దీని ఫినిషింగ్ కోసం ఎదురు చూస్తూ చిరుతో తన సినిమా కోసం కొరటాల శివ ప్రస్తుతం లొకేషన్స్ తో పాటు మిగిలిన స్టార్ కాస్ట్ ని డిసైడ్ చేసే పనిలో ఉన్నాడు. సైరా కనక అనుకున్న టైంకి పూర్తై ఉంటే ఈ పాటికి చిరు-శివ మూవీ ఓపెనింగ్ తాలుకు కొబ్బరికాయ పగిలిపోయేది. కాని జరగలేదు. ఈ లెక్కన ఇంకో మూడు నెలలు వెయిట్ చేయక తప్పేలా లేదు.
కారణాలు ఏవైనా మెగా ప్లానింగ్ లో బాలన్స్ లోపించడం వల్లే సైరా డిలే తో పాటు కొరటాల శివ ప్రాజెక్ట్ లేట్ అవుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోపక్క రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో బిజీ అయిపోయి సైరా వ్యవహారాలన్నీ సుస్మితకు అప్పజెప్పినట్టు టాక్ ఉంది. సైరా పూర్తయ్యాక మాత్రం ఎక్కువ టైం తీసుకోకుండా అతి తక్కువ సమయంలో చిరు సినిమాను పూర్తి చేసేందుకు కొరటాల శివ పక్కా స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నట్టు వినికిడి