ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆచార్య ఖమ్మం షెడ్యూల్ ఇటీవల ముగించారు. ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని ప్రచారమైనా టీమ్ దానిని ఖండించింది. తదుపరి షెడ్యూల్ కోకాపేటలో నిర్మించిన ధర్మస్థలి సెట్లో వచ్చే వారం ప్రారంభమవుతుంది. కాజల్ అగర్వాల్ ఈ షెడ్యూల్ లో టీమ్ తో చేరతారు. తనపై సీన్స్ అన్నీ పూర్తి చేస్తారని సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో తొలి పూర్తి యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. దర్శకుడు కొరటాల ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రంలో సిద్ధ పాత్రలో నటిస్తున్నారు. అతడి పాత్ర చిత్రీకరణ ఆద్యంతం పూర్తి చేసారు. మణి శర్మ ఈ చిత్రానికి బాణీల్ని సిద్ధం చేస్తున్నారు. రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డే మెరుపులు మెరిపించనుందని సమాచారం. మే 13న విడుదల కానున్న ఈ సినిమాకి ప్రీబిజినెస్ హైప్ అసాధారణంగా ఉందని ఇటీవల కథనాలొచ్చాయి.
తాజా సమాచారం మేరకు హైదరాబాద్ లో జరిగే మంచు విష్ణు మోసగాళ్లు ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న చిరు ఇలాంటి వేడుకల్ని అస్సలు విస్మరించడం లేదు. యువతరం హీరోల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే విష్ణు ఆహ్వానాన్ని మన్నించి ఆయన విచ్చేస్తారనే భావిస్తున్నారు.