బిగ్ బీ స్ట్రేటజీని ఫాలో అవుతున్న మెగా బాసు

Update: 2020-03-31 15:10 GMT
మెగాస్టార్ చిరంజీవి సడెన్ గా సోషల్ మీడియాలో ఖాతాలను ఓపెన్ చెయ్యడం.. యాక్టివ్ గా మారడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అటు పాత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ట్విట్టర్ తో పాటుగా కొత్త ప్లాట్ ఫామ్ అయిన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఖాతాలు తెరిచి అభిమానులను మురిపించేలా ఇంట్రెస్టింగ్ అప్డేట్లు ఇస్తున్నారు.  చాలామంది స్టార్ల తరహాలో జస్ట్ అప్డేట్లు ఇచ్చి సరిపెట్టడం లేదు. ఇతరులు పెట్టే మెసేజిలకు స్పందిస్తున్నారు.

ఈ మెగా హంగామాను చూస్తున్నకొందరు మన టాలీవుడ్ మెగాస్టార్.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను ఫాలో అవుతున్నారని అభిప్రాయపడుతున్నారు. మునుపటి తరం స్టార్ హీరోల విషయమే తీసుకుంటే బిగ్ బి కంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు మరొకరు లేరు. 70 ల వయసులో కూడా ఆయన ఉత్సాహం.. ఈ తరం యువతతో కనెక్ట్  అయ్యే విధానం ఎవరికైనా  ముచ్చటగా అనిపిస్తుంది. అయితే ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్టార్ల కు సోషల్ మీడియాలో బ్రాండ్ వేల్యూఏర్పడుతుంది. ఆయన ట్విట్టర్ లో పెట్టే మెసేజిల కారణంగా ప్రేక్షకులకు చేరువ కావడం ఒక ప్రయోజనం అయితే.. సోషల్ మీడియాలో పెట్టే మెసేజిల ద్వారా సంపాదించడం మరో ఎత్తు. బిగ్ బీ బ్రాండ్ విలువ రోజుకు పది కోట్లు అని ఇప్పటికే లెక్కకట్టారు.

బిగ్ బీ అంటే చాలా ఏళ్ళ నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు కాబట్టి ఆ ఫీట్ సాధ్యమైంది.  మరి మన మెగాస్టార్ బ్రాండ్ వేల్యూ ఎంత  ఉంటుందని ఈ వ్యవహారాల్లో నిపుణుడైన ఒక వ్యక్తిని అడిగితే రోజుకు కోటి రూపాయలు ఇవ్వొచ్చు అంటూ కాస్త సెటైర్ ధ్వనించేలా బదులిచ్చాడు. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. ఫ్యూచర్ లో మెగా బ్రాండ్ ఏ స్థాయికి వెళ్తుందో వేచి చూడాలి .
Tags:    

Similar News