హీరోగా .. కేరక్టర్ ఆర్టిస్టుగా మురళీమోహన్ సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. హీరోగా ఆయన కెరియర్లో చెప్పుకోదగిన హిట్స్ ఉన్నాయి. ఒక వైపున కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు తమదైన మార్గంలో దూసుకెళుతుంటే, వాళ్ల పోటీని తట్టుకుని మురళీమోహన్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఫ్యామిలీ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తరువాత కూడా కేరక్టర్ ఆర్టిస్టుగా ఆయన కీలకమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. కొంతకాలంగా మాత్రం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
అలాంటి ఆయన చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించారు. గతంలో ఆయన చిరంజీవితో కలిసి కొన్ని సినిమాలలో నటించారు. 'మనవూరి పాండవులు' సినిమా నుంచి వాళ్ల ప్రయాణం కలిసి సాగుతోంది. 'గ్యాంగ్ లీడర్' .. 'యుద్ధభూమి' .. 'త్రినేత్రుడు' .. ఇలా వాళ్ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు గుర్తుండిపోతాయి.
ఎలాంటి కారణాలు లేకపోయినా ఆ తరువాత వాళ్లిద్దరూ కలిసి నటించడం కుదరలేదు. అలా చూస్తుండగానే వాళ్లు కలిసి నటించడం మానేసి 31 ఏళ్లు గడిచిపోయాయి. ఇది నిజంగా ఆశ్చర్యపోవలసిన విషయమే.
మళ్లీ ఇన్నాళ్లకి చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో మురళీమోహన్ ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఈ వేషం తనకి ఎలా వచ్చిందనే విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ .. "ఈ మధ్య ఒక రోజున చిరంజీవి గారు కాల్ చేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' చేస్తున్నట్టుగా చెప్పారు. అందులో ఒక ముఖ్యమైన రోల్ ఉందని అన్నారు. గతంలో ఒక సందర్భంలో నేను వైట్ హెయిర్ తో ఆయనకి కనిపించాను. అలా వైట్ హెయిర్ తో ఉన్న ఫొటో ఒకటి పంపించామన్నారు. నేను అలాగే చేశాను.
ఆ ఫొటో చూడగానే ఆ పాత్రకి ఆ లుక్ కరెక్ట్ అంటూ మోహన్ రాజా సెలెక్ట్ చేయడం .. ఆ విషయం నాకు చెప్పడం జరిగిపోయింది. అలా 'గాడ్ ఫాదర్' సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది. ఆల్రెడీ నా పోర్షన్ కి సంబంధించిన షూటింగు పూర్తయింది.
చాలా కాలం తరువాత చిరంజీవిగారితో కలిసి నటించడం ఆనందాన్ని కలిగించింది. చిరంజీవిగారి అభిమానుల మాదిరిగా నేను కూడా ఈ సినిమా విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. మరి అందులో ఆయన పోషించిన ఆ పాత్ర ఎంత కీలకమనేది చూడాలి.