మీడియాపై మెగాస్టార్ అస‌హ‌నం!

Update: 2022-10-09 05:02 GMT
నిన్న‌టి రోజున జ‌రిగిన `గాడ్ ఫాద‌ర్` విజ‌యోత్సవం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి..అందులో పాత్ర‌ల గురించి..మీడియా అత్యుత్సాహం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. చిరంజ‌వి నోట మునుపెన్న‌డు రాని స‌రికొత్త వ్యాఖ్య‌లు రాడం ఇదే తొలిసారి .అందులోనూ మీడియా గురించి ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడని చిరు తొలిసారి అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు ఆయ‌న మాట‌ల్ని  బ‌ట్టి క‌నిపిస్తుంది.

అయితే ఆయ‌న వ్యాఖ్య‌లు స‌మంజ‌స‌మేన‌ని ఇండ‌స్ర్టీ స‌హా మెజార్టీ వ‌ర్గం భావిస్తోంది. సినిమా విడుదలకు ముందే సినిమాపై నెగెటివ్ ప్రచారం జరగడంపై చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేశారు. మెరుగైన ఫలితాన్ని ఇవ్వడానికి టీమ్ ఎలా రెస్ట్‌లెస్‌గా పని చేసిందో కూడా అతను వెల్లడించారు. ఓ సారి మెగాస్టార్ వ్యాఖ్య‌ల్లోకి వెళ్తే..

`ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు బలమైన కంటెంట్ ఉన్న సినిమాలను చూస్తున్నారు. అస‌లు  లూసిఫర్‌లో మహిళలకు సంబంధించిన అంశాలు లేవు. మేము దానిని పూర్తిగా మార్చాము. గాడ్‌ఫాదర్‌ని చూడటానికి మహిళలు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మేము గాడ్‌ఫాదర్‌ని ఆసక్తికరంగా - ఆకర్షణీయంగా చేయాలనుకుంటున్నాము.

సత్యదేవ్ క్యారెక్టర్   కంక్లూజన్  నాకు నచ్చలేదు. మోహన్ రాజాని మరో వెర్షన్ తో రమ్మని అడిగాను. క్లైమాక్స్ కోసం అతను చేసిన మార్పులు నాకు నచ్చాయి.   దాన్ని మేము 15 రోజుల క్రితమే సీక్వెన్స్‌ని రీ-షూట్ చేసాము. ఇదే స‌మ‌యంలో సినిమా గురించి మీడియాలో  ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు మొద‌ల‌య్యాయి. నేరుగా  సినిమా ప్రమోష‌న్ గురించి మీడియా మాట్లాడ‌టం హాస్యాస్ప‌దంగా అనిపించింది.

సినిమాను ఎప్పుడు ప్రమోట్ చేయాలో మా తెలియదా? సినిమాకి బజ్ ఎలా తీసుకురావాలో మాకు తెలియదా? ఈవెంట్ గురించి.. సినిమా గురించి మీడియాకు హానికరంగా మాట్లాడ‌టం త‌గ‌దు. నేను ఆరోజు వర్షంలో తడుస్తున్నప్పటికీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాను. అప్పుడు మీడియా  ఎంతో బాధ్య‌త‌గా వారి వృత్తిని నిర్వ‌ర్తించారు. ఆ ర‌కంగా సినిమా ప్రమోషన్‌లో సహకరించిన మీడియాకు  కృతజ్ఞతలు` అని అన్నారు.

ఇంకా ప్ర‌స్తుతం సెట్స్ లో ఉన్న సినిమాల గురించి మాట్లాడుతూ.. `నేను గాడ్‌ఫాదర్‌`లో సెటిల్డ్ గా సాగే  పాత్రను పోషించగా.. బాబీ చిత్రంలో నా పాత్ర  పాతకాలపు సినిమాల వలే మాస్‌గా .. వినోదాత్మకంగా ఉంటుంది. మెహర్ రమేష్ సినిమా సెంటిమెంట్ మరియు డ్రామాతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్. రెండు చిత్రాలు అభిమానులు మెచ్చేలానే ఉంటాయి. వాళ్ల అంచ‌నాలకు ఏమాత్రం త‌గ్గ‌కుండానే ఉంటాయి` అని అన్నారు.
Tags:    

Similar News