మలయాళ మెగాస్టార్ మమ్ముటి నటిస్తోన్న వార్ ఎపిక్ చిత్రం `మమాంగం`. భారీ విజువల్ గ్రాఫిక్స్ వార్ ఎపిసోడ్స్ తో తెరకెక్కుతున్న చిత్రమిది. మాలీవుడ్ లోనే నంబర్ వన్ బడ్జెట్ చిత్రంగా ప్రచారమవుతోంది. 17వ శతాబ్ధం నాటి కథతో వారియర్ బ్యాక్ డ్రాప్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. మమ్ముట్టి ఈ చిత్రంలో పోరాట వీరుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. దక్షిణాది సహా ఇతర భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రైట్స్ ను స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దక్కించుకున్నట్లు సమాచారం.
తెలుగులో మమ్ముట్టి కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన పలు సినిమాలు ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించాయి. ఆ మధ్య వైఎస్సార్ బయోపిక్ లో టైటిల్ పాత్ర పోషించి తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మార్కెట్ ను అంచనా వేసిన అరవింద్ `మమాంగం` హక్కుల్ని చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది.
పంపిణీ ఎగ్జిబిషన్ రంగంలో కమాండ్ ఉన్న అల్లు అరవింద్ చేతిలో రైట్స్ ఉన్నాయి అంటే రిలీజ్ కు ఎలాంటి ఢోకా లేనట్లే. భారీ ఎత్తున ఈ డబ్బింగ్ సినిమా రిలీజ్ అవ్వడం ఖాయం. అలాగే ఈ చిత్రానికి దర్శకుడు ఒక్కరు కాదు. ఇద్దరు.. ముగ్గురు పని చేయడం ఆసక్తికరం. తొలి షెడ్యూల్ ని సంజీవ్ పిళ్లై తెరకెక్కించారు. రెండవ షెడ్యూల్ కి ఎం.పద్మాకుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఇందులో ప్రాచీ తెహ్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉన్ని ముకుందన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా రిలీజ్ తేదీని ప్రకటించాల్సి ఉంది.