మెగాస్టార్ చిరంజీవి `ఖైదీ నంబర్ 150`తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత `సైరా`తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరు గత ఏడాది నుంచి మునుపెన్నడూ లేని స్పీడుని చూపిస్తున్నారు. ఎవరు సినిమా అడిగినా ఎడా పెడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ బిగ్ లైనప్ ని రెడీ చేసుకున్నారు. దీంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆయన అభిమానుల్లోనూ ఆనందంతో పాటు చిరు ఏంటీ ఇంతగా స్పీడు పెంచేశారనే ఆశ్చర్యం మొదలైంది.
మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఇప్పుడు ఏకంగా ఐదు చిత్రాలున్నాయి. ఇప్పటికే `ఆచార్య` షూటింగ్ పూర్తయిపోయి రిలీజ్ కి రెడీ అవుతోంది. గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రీకరణ దశలో వున్నాయి. బాబీ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మూవీలోనూ నటిస్తున్నారు. `ఈ చిత్రానికి `వాల్తేరు వీరయ్య` అనుకున్నారు. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ ని `వాల్తేరు మొనగాడు`గా మార్చినట్టుగా తెలుస్తోంది. ఇది చిరు నటిస్తున్న 154వ చిత్రం.
కోవిడ్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన `ఆచార్య` 152 వ చిత్రం. ఇందులో రామ్ చరణ్ తో కలిసి చిరు నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీపై భారీ హైప్ ఏర్పడింది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని నిరంజన్ రెడ్డి, అవినాష్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 29న ఈ చిత్రం సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇక 153 వ చిత్రంగా మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` ఆధారంగా `గాడ్ ఫాదర్` చిత్రం రూపొందుతోంది.
మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో యంగ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతే కాకుండా ఈ చిత్రంలోని స్పెషల్ గెస్ట్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇక 154వ చిత్రంగా దర్శకుడు బాబి ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తోంది. `ఈ చిత్రానికి `వాల్తేరు వీరయ్య` అనుకున్నారు. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ ని `వాల్తేరు మొనగాడు`గా మార్చినట్టుగా తెలుస్తోంది.
ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలకమైన అతిథి పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ వార్తలపై రవితేజ ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశారు కూడా. ఇక 155వ చిత్రంగా `భోళా శంకర్` తెరకెక్కుతోంది. తమిళ బ్లాక్ బస్టర్ `వేదాలం` ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో చిరుకు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఆమెకు జోడీగా యంగ్ హీరో నాగశౌర్య కనిపించబోతున్నారు.
ఇవే కాకుండా వెంకీ కుడుములతో 156వ చిత్రాన్ని, మారుతితో 157వ చిత్రాన్ని, అనిల్ రావిపూడితో 158వ చిత్రాన్ని ఫైనల్ చేశారు చిరు. ఈ చిత్రాలకు సంబంధించిన డిటైల్స్ బయటికి రావాల్సి వుంది. ఇందులోనూ యంగ్ హీరోలకు ఛాన్స్ ఇస్తారా? లేదా అన్నది తెలియాల్సి వుంది. ఉన్నట్టుండి చిరు యంగ్ హీరోలకు తన సినిమాల్లో ఛాన్స్ లు ఇస్తుండటంతో అంతా ఆ మర్మమేంటని ఆరాతీస్తున్నారు. చిరు మాత్రం స్టోరీ డిమాండ్ మేరకే యంగ్ హీరోలకు తన సినిమాల్లో అవకాశాలు కల్పిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.