నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం , చందమామ వంటి బాక్సాఫీస్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల కాలంలో మాత్రం సరైన విజయాలను అందుకోలేక పోతున్నారు. ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు రంగమార్తాండ అనే సినిమాతో కృష్ణ వంశీ కమ్ బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాడు.
ఒక మరాఠీ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ ఎమోషనల్ ఆర్ట్ ఫిల్మ్ లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి తన గాత్రాన్ని అందించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే.
అయితే రెగ్యులర్ గా కాకుండా కొత్తగా డిఫరెంట్ అటెంప్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రంగమార్తాండ సినిమా కోసం చిరంజీవి షాయరీ పారాయణం చేయనున్నాడని తాజా సమాచారం.
కృష్ణ వంశీ మెగాస్టార్‌ని పూర్తిగా మరో పద్ధతిలో ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడట. భావోద్వేగాన్ని వ్యక్తీకరించడానికి షాయారీ అనేది ఒక ప్రత్యేకమైన మార్గం. అందుకే కృష్ణ వంశీ ఈ ఆలోచన చేయడంతో చిరంజీవి కూడా థ్రిల్ అయ్యారని తెలుస్తోంది. తెలుగు షాయరీని గతంలో ఎప్పుడూ సినిమాల్లో చెప్పింది లేదు. ఇది వాయిస్ ఓవర్ లాగా ఉండకుండా ఒక రాగం తరహాలో ఇది పాటగా ఉండదు.
ఇది చాలా ప్రత్యేకమైనది. నేటి యువతరానికి కూడా బాగాన్స్ కనెక్ట్ అవుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను చిరంజీవి పూర్తి చేయనున్నారట. మలయాళ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ డ్రామాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, అలాగే ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. అలాగే ఈ సినిమా అనంతరం మెగాస్టార్ చిరంజీవితో కృష్ణవంశీ ఒక సినిమా చేయనున్నట్లు టాక్ కూడా వచ్చింది. గతంలోనే మెగాస్టార్ తప్పకుండా సినిమా చేద్దామని మాట కూడా ఇచ్చారట. ఇక రంగమార్తాండ సినిమా కృష్ణవంశీకి చాలా ముఖ్యం కానుంది. మరి ఈ సినిమాతో ఎంతవరకు ఫామ్ లోకి వస్తారో చూడాలి.