శుక్రవారం ఫోన్ చేస్తే.. కథ వినకుండా ఆదివారం సెట్లో ఉందట!

Update: 2021-11-01 05:30 GMT
కేవలం రోజు వ్యవధి లో షూటింగ్ కు వెళ్లటం.. అది కూడా ఒక పేరున్న హీరోయిన్ అవుతుందా? అంటే కాదనే చెబుతారు. కానీ.. మెహ్రీన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. దర్శకుడు మారుతి దర్శకత్వం లో దీపావళికి థియేటర్ల లో సందడి చేయనున్న ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ కి ఓకే చెప్పే విషయం లో కథ గురించి అడగకుండానే ఓకే చెప్పేసిందట. శుక్రవారం ఫోన్ చేసి.. సినిమా ఉంది చేస్తావా? అని అడగటం.. ఎప్పటి నుంచి అంటే.. ఆదివారం నుంచి షూట్ ఉందంటే.. ఓకే చెప్పేసి.. సండే సెట్ లో ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

సాధారణం గా ఒక సినిమా కు ఓకే చెప్పటానికి కథ వినటం.. అందు లో తన పాత్రకున్న పరిధి తెలుసుకోవటం.. లెక్కలు వేసుకోవటం లాంటివెన్నో ఉంటాయి. కానీ.. మెహ్రీన్ మాత్రం అందుకు భిన్నం గా ఓకే చెప్పటానికి కారణం దర్శకుడు మారుతి మీద ఉన్న నమ్మకమని చెబుతున్నారు. మహాను భావుడు సినిమా తర్వాత కలిసి చేసిన సినిమా చెప్పిన ఆమె.. యువీ సంస్థ.. మారుతి దర్శకత్వం అన్న తర్వాత ఆలోచించటానికి ఏముంటుంది? అందుకే.. కథ కూడా వినకుండా ఓకే చెప్పేసినట్లు వెల్లడించింది.

మారుతి తో పాటు హను రాఘువపూడి ఫోన్ చేసినా.. కథ వినకుండా సినిమా చేయటానికి సిద్ధపడతానని.. తన మొదటి సినిమా క్రిష్ణ గాడి వీరప్రేమగాథ లో తనకు మంచి పాత్రను ఇచ్చారని చెప్పింది. అందరు కాకున్నా కొంత మంది దర్శకుల పై నమ్మకం అంత బలం గా ఉంటుందని చెప్పింది. ఏమైనా.. సినిమా కు ఓకే చెప్పిన రోజు వ్యవధిలో షూటింగ్ కోసం సెట్ కు వచ్చేయటం అందరి కి సాధ్యం కాదు.. ఈ విషయంలో మెహ్రీన్ ది గ్రేట్ అని చెప్పాల్సిందే.
Tags:    

Similar News