ఒకసారి బ్యాడ్ టైం స్టార్ట్ అయితే వరసగా మనల్ని ఝాడించి కొడుతుందెందుకు? ఏపని చేసినా మనం అందులో మనకు దెబ్బే తగులుతుందెందుకు? దీనికి లాజికల్ సైంటిఫిక్ అన్సర్ చెప్పడం కష్టం. చాలామందికి అర్థం కాని మెటాఫిజికల్ కాన్సెప్ట్ ప్రకారం అయితే ఎప్పుడు దరిద్రం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే దరిద్రం మీపక్కనే వచ్చి తాపీగా మిమ్మల్ని చూస్తూ కూర్చుంటుందట. మరి దీనికి విరుగుడు?.. 24 గంటల్లో 23 గంటలు దరిద్రం గురించి ఆలోచించడం మాని రోజులో ఒక్క గంట మాత్రమే దరిద్రపు ఆలోచనలకు కేటాయించి మిగతా టైమ్ పాజిటివ్ థింగ్స్ మీద ఫోకస్ చేయడమేనట!
దీన్ని నమ్మేవారెవరు.. ఆచరించి ఫలితం పొందేవారెవరు? ఇలాంటి గజిబిజి టాపిక్స్ పక్కనబెడితే భటిండా బ్యూటీ మెహ్రీన్ ప్రస్తుతం ఫ్లాపుల హోరులో ఉంది. 'రాజా ది గ్రేట్' తర్వాత ఇప్పటికే మూడు దెబ్బలు 'C/o సూర్య'.. 'జవాన్'.. 'పంతం' రూపంలో తగిలాయి. హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత తన ఆశలు టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'నోటా' పై పెట్టుకుంటే.. ఓపెనింగ్ వరకూ బాగానే ఉన్నా ఆదివారానికే వీక్ అయింది.. సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేలా లేదని ఇప్పటికే కథనాలు వెలువడుతున్నాయి. హ్యాట్రిక్ ప్లస్ వన్ అని అంటున్నారు. ఎన్టీఆర్ సినిమా 'అరవింద సమేత' రిలీజ్ అయితే ఈ సినిమా రన్ ఎండ్ అయినట్టేనని అంటున్నారు.
సినిమా ఫ్లాప్ అవడం ఒక బాధ అయితే.. మరోవైపు ఈ సినిమాలో క్యారెక్టర్ అనేదే లేకుండా మెహ్రీన్ ఎందుకు ఒప్పుకుందని విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు మెహ్రీన్ చేసిన పాత్రను హీరోయిన్ అంటారా?.. అంటూ జనాలు సెటైర్లేస్తున్నారు. ఇక మెహ్రీన్ కు ఒకటే ఆశ. అదేంటంటే ఫన్ & ఫ్రస్ట్రేషన్. ఇక దీనికి మీకు అర్థం వివరించనవసరం లేదనుకుంటా?