'చాణక్య'తో సర్‌ ప్రైజ్‌ చేయబోతుందట

Update: 2019-09-28 01:30 GMT
'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రంతో హీరోయిన్‌ గా పరిచయం అయిన మెహ్రీన్‌ కు సక్సెస్‌ లు వస్తున్నా అవకాశాలు మాత్రం అడపా దడపా వస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో 'ఎఫ్‌ 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయినా కూడా ఈమెకు ఆఫర్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. తాజాగా ఈమె గోపీచంద్‌ తో కలిసి 'చాణక్య' చిత్రంలో నటించింది. గతంలో గోపీచంద్‌ తో పంథం చిత్రంలో కలిసి నటించిన మెహ్రీన్‌ రెండవ సారి చాణక్య చిత్రం కోసం కలిసింది.

చాణక్య చిత్రం అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌ లో మెహ్రీన్‌ ఎంటర్‌ టైన్‌ చేసింది. సినిమా ప్రమోషన్‌ లో భాగంగా మీడియాతో మాట్లాడిన మెహ్రీన్‌ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. సినిమాలో నా పాత్ర పేరు ఐశ్వర్య. సినిమాలో మంచి ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. మొదటి సారి నేను అలీ గారు.. రఘుబాబు.. సునీల్‌ గారితో కలిసి నటించాను. వారితో కామెడీ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయంది.

ఈ చిత్రంలో నా పాత్రకు సంబంధించి ఒక సస్పెన్స్‌ ఉంటుంది. ఆ సస్పెన్స్‌ ఇప్పుడు నేను చెప్పలేను.. కాని సినిమాలో ఆ సస్పెన్స్‌ కు ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు. ఇది గోపీచంద్‌ గారితో నాకు రెండవ సినిమా. ఆయన ఒక పర్‌ ఫెక్ట్‌ మన్‌. చాలా కామ్‌ గా తన పని తాను చేసుకుంటూ అన్ని విషయాల్లో కూడా రిలాక్స్‌ గా కనిపిస్తూ ఉంటాడు. ఆయనతో వర్క్‌ చేయడం చాలా కంఫర్ట్‌ గా ఉంటుంది. కామ్‌ గా కనిపించినా కూడా ఆయన సెట్స్‌ లో ఉన్నంత సమయం చాలా ఎనర్జిటిక్‌ గా ఉంటాడు. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన అనీల్‌ సుంకర గారి నిర్మాణంలో ఈ చిత్రం చేయడం చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ తో ఈ చిత్రంను దర్శకుడు తిరు తెరకెక్కించారంది. ఈ చిత్రంతో పాటు కళ్యాణ్‌ రామ్‌ తో 'ఎంత మంచివాడవుర' చిత్రంలో కూడా మెహ్రీన్‌ నటించింది. ఆ సినిమా కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు తమిళం మరియు పంజాబీలో కూడా ఈమె ఒక్కో సినిమా చొప్పున చేస్తోంది.

Tags:    

Similar News