మెహ్రీన్.. ఇక టాప్ లీగ్ కష్టమేనా?

Update: 2019-12-16 07:58 GMT
ఒక హీరోయిన్ కెరీర్ ఎక్కువకాలం కొనసాగాలన్నా.. విజయాలు సాధించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలన్నా మంచి కథల ఎంపిక చాలా ముఖ్యం.  మెహ్రీన్ పిర్జాదా 'కృష్ణగాడి వీరప్రేమగాథ'తో టాలీవుడ్ ఎంటర్ ఇచ్చింది.  మొదటి సినిమాతోనే మంచి హిట్ సాధించింది.  దీంతో మంచి ఆఫర్లే వచ్చాయి.  'మహానుభావుడు'.. 'రాజా ది గ్రేట్' సినిమాలతో  హిట్లను కూడా తన ఖాతాలో వేసుకుంది.

మొదట్లో జర్నీ సాఫీగానే సాగింది కానీ తర్వాత మాత్రం వరస ఫ్లాపులు పలకరించాయి.  దాదాపు అరడజను ఫ్లాపుల రావడంతో ఇక మెహ్రీన్ ఫేడ్ అవుట్ అవుతుందని అనుకున్నారు. అయితే లక్కీగా 'F2' తో ఒక్కసారిగా  బౌన్స్ బ్యాక్ అయింది.  హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ మెహ్రీన్ చేసిన అల్లరి అందరినీ ఆకట్టుకుంది.  ఈ సినిమా విజయం తర్వాత మరోసారి మెహ్రీన్ కు డిమాండ్ పెరిగింది.. ఆఫర్లు వచ్చాయి.  అయితే అవన్నీ మీడియం రేంజ్ ప్రాజెక్టులే.  మెహ్రీన్ నటించిన రెండు సినిమాలు 'ఎంత మంచివాడవురా'.. 'అశ్వథ్థామ' జనవరిలోనే రిలీజ్ అవుతున్నాయి.  ఈ సినిమాలు హిట్ అయితే సరే కానీ లేకపోతే మెహ్రీన్ కు ఫ్యూచర్ లో ఆఫర్లు కష్టమే.

మరో విషయం ఏంటంటే మెహ్రీన్ కు పెద్ద హీరోలు.. స్టార్ హీరోలు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వడం లేదని టాక్ ఉంది.  సీనియర్ స్టార్ హీరోలు కూడా మెహ్రీన్ కు  ఆఫర్లు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదట.  ఈ లెక్కన మెహ్రీన్ కు డిమాండ్ పెరగాలంటే జనవరిలో రిలీజ్ కానున్న 'ఎంత మంచివాడవురా'.. 'అశ్వథ్థామ' లో ఒకటైనా సూపర్ హిట్ కావాల్సిందే. అలా జరగకపోతే మెహ్రీన్ టాప్ లీగ్ చేరడం కష్టమేనని అంటున్నారు.
Tags:    

Similar News