కొన్ని సినిమా విచిత్రాలు అంతే. గమ్మత్తుగా ఉంటాయి. తమిళనాడులో సమ్మె ప్రభావం పూర్తిగా తొలగకపోవడంతో నిర్మాతలు కొత్త సినిమాలు విడుదల చేయటం లేదు. పాతవే బయటికి తీసి థియేటర్ యజామానులు కొత్తగా ప్రమోట్ చేసుకుని రోజులు గడుపుతున్నారు. చెన్నై ఆప్షన్ తీసుకుని బుక్ మై షో యాప్ ఓపెన్ చేస్తే మీకు అందులో బాషా - మెర్సల్ - వేదాలం - తేరి - బాహుబలి 1 లాంటి పాత సినిమాలు కనిపిస్తే ఆశ్చర్యపోకండి. అప్ డేట్ అవ్వలేదేమో అని అనుమానం అక్కర్లేదు. ప్రస్తుతం అక్కడ ఇవే ఆడుతున్నాయి. వీటిలో మన మహేష్ బాబు సినిమా కూడా ఒకటి ఉంది. స్పైడరా అని సందేహం వలదు. 16 ఏళ్ళ క్రితం వచ్చిన టక్కరి దొంగ సినిమా డబ్బింగ్ వెర్షన్ వెట్రి వీరన్ ను ఇప్పుడు విడుదల చేసారు. మహేష్ గెటప్ పాతగా ఉంటె గుర్తుపడతారేమో అని శ్రీమంతుడు స్టిల్స్ కూడా వాడుకున్నారు.
నిన్న అక్కడ థియేటర్స్ లో వెట్రి వీరన్ విడుదలైంది. అప్పట్లో ఈ మూవీ జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో అత్యంత భారీగా నిర్మించిన ఈ మూవీ అంచనాలు పూర్తిగా అందుకోవడంలో విఫలమైంది. కాని మహేష్ రిస్కీ అడ్వెంచర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మణిశర్మ మ్యూజిక్ మరో పెద్ద ప్లస్ పాయింట్. లీసా రే, బిపాసా బసు అందాలు బోనస్ గా ఎంజాయ్ చేసారు. చిరు చేసిన కొదమసింహం తర్వాత పన్నెండేళ్ళకు తెలుగులో వచ్చిన కౌ బాయ్ మూవీ అదే. ఇన్ని విశేషాలు ఉన్నాయి కాని అంత పాత సినిమాను ఇప్పుడు విడుదల చేయటంలో మతలబు సినిమాలు లేకపోవడమే. ట్విస్ట్ ఏంటంటే 2013 ఇదే సినిమా విడుదల చేస్తే ఎవరు పట్టించుకోలేదు.
శ్రీమంతుడు - స్పైడర్ డబ్బింగ్ వెర్షన్స్ తో మహేష్ అక్కడివాళ్ళకు సుపరిచితుడే. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయినా స్పైడర్ టీవీ రేటింగ్స్ లో మాత్రం రికార్డ్స్ సెట్ చేసింది. కబాలి - మెర్సల్ కు ధీటుగా 10 ప్లస్ రేటింగ్ తో వామ్మో అనిపించింది. బహుశా ఆ క్రేజ్ వర్క్ అవుట్ అవుతుందని టక్కరి దొంగ వదిలారేమో.