మెంటల్ మదికే ఎన్నారైల ఓటు

Update: 2017-11-28 04:53 GMT
గత రెండు వారాలుగా చిన్న సినిమాల జాతర జరుగుతోంది. దాదాపు పదేసి సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. వీటిలో కొన్ని రిలీజ్ కి ముందు బజ్ క్రియేట్ చేయగలిగినా.. విడుదల తర్వాత ఆ జోరు చూపించలేకపోయాయి. గత వారం విడుదలైన సినిమాల్లో కూడా.. జనాలను థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్న మూవీగా మెంటల్ మదిలో ఒకటే కనిపిస్తోంది.

స్థానికంగానే కాకుండా.. ఇంట్రెస్ట్ కలిగించిన కొన్ని సినిమాలు యూఎస్ లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. నారా రోహిత్ చేసిన పూర్తి స్థాయి మాస్ ఎంటర్టెయినర్ బాలకృష్ణుడుతో పాటు.. నీడ పోయిందనే కాన్సెప్ట్ తో వచ్చిన నెపోలియన్ కూడా కొంత ఆసక్తి కలిగించింది. కానీ ఇదే ట్రెండ్ వసూళ్ల విషయంలో మాత్రం కనిపించడం లేదు. ఉన్నంతలో మెంటల్ మదిలో మూవీ మాత్రం పర్లేదని అనిపించుకుంటోంది. గురువారం ప్రీమియర్స్ నుంచి ఈ మూవీకి నిలకడగా వసూళ్లు వస్తున్నాయి. శనివారం 48వేల డాలర్లకు పైగా వసూళ్లు రాగా.. తొలి వారాంతం మొత్తంలో 1.34 లక్షల డాలర్లు వచ్చాయి.

ఇవి కూడా అంచనాలకు తగిన మొత్తం కాకపోయినా.. చిన్న సినిమా కాబట్టి పర్లేదని అనుకోవచ్చు. మిగతా వాటితో పోల్చితే మెంటల్ మదిలో మూవీ మాత్రమే ఆ మాత్రమైనా ఆకట్టుకోగలిగింది. ఇతర చిత్రాలు అన్నిటినీ యూఎస్ మార్కెట్లో ఇప్పటికే డిజాస్టర్స్ గా తేల్చేశారు డిస్ట్రిబ్యూటర్స్.



Tags:    

Similar News