ఈ మెర్క్యూరి ఏదో భలే ఉందబ్బా

Update: 2018-03-07 11:23 GMT
ఇప్పుడు కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలు తీయడం కంటే.. అందరికీ తెలిసిన దానినే కొత్తగా తీయడం ఒక కొత్త కాన్సెప్ట్. అదిగో చాలామంది అదే తరహాలో పాత చింతకాయ పచ్చడిని కొత్త జార్ లో అందించి హిట్లు కొడుతున్నారు. అంటే ఫీలవుతారు కాని.. ఈ మధ్యకాలంలో తెలుగులో తమిళంలో హిట్లయిన సినిమాలన్నీ అవే బాపత్తు. ఇక ఈ మెర్కురి సినిమా కథేంటో చూద్దాం పదండి.

చాలా కాలం క్రితం మెర్క్యూరి ఎక్కువగా కలిసిన నీరు తాగి ఒక ఊరు ఊరంతా చచ్చిపోయారు. అక్కడికి కొందరు టూర్ కోసం వచ్చారు. వారు మాట్లాడితే చాలు.. అక్కడ ప్రభుదేవా అనే దెయ్యం వచ్చి అందరినీ చంపేస్తుంది. అందుకే వారు సైలెంట్ గా ఉండాలి. సో సినిమా అంతా మాటల్లేవ్. గతంలో పిజ్జా వంటి డిఫరెంట థ్రిల్లర్లను తీసి అలరించిన కార్తీక్ సుబ్బరాజ్ ఇప్పుడు ఇలా మాటల్లేని సినిమాతో వస్తున్నాడు. మాటలు లేవు కాబట్టి.. ఇక బాషతో సంబంధం ఉండదు కాబట్టి.. సినిమాను ఇండియా అంతా రిలీజ్ చేసేస్తున్నాడు. 'నో లాంగ్వేజ్ ఫిలిం.. రిలీజింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజస్' అంటున్నాడు. కాని టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో.. సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

ఇకపోతే ఈ మద్యకాలంలో థ్రిల్లర్ మరియు హారర్ సినిమాలు మ్యూజిక్ బాగుంటే చాలు ఆడేస్తున్నాయి. భాగమతి అందుకు ఎగ్జాంపుల్. చూస్తుంటే ఇప్పుడు సంతోష్‌ నారాయణ్‌ అందించిన మ్యూజిక్ కూడా మెర్కురి సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళేలా ఉంది. ఏప్రియల్ 13న సినిమా రిలీజ్.

క్లిక్ చేయండి ఫర్ టీజర్


Full View
Tags:    

Similar News